గూగుల్ కి తన వయసు చెప్పిన మిడిల్ క్లాస్ భామ

గూగుల్ కి తన వయసు చెప్పిన మిడిల్ క్లాస్ భామ
గూగుల్ కి తన వయసు చెప్పిన మిడిల్ క్లాస్ భామ

మిడిల్ క్లాస్ మెలోడీస్ చిత్రంలో హీరోయిన్ గా చేసిన వర్ష బొల్లమ మంచి క్రేజ్ ను తెచ్చుకుంది. ఈ సినిమా ఇచ్చిన ఉత్సాహంతో ఆమె వరసగా సినిమాలను ఒప్పుకుంటోంది. మిడిల్ క్లాస్ మెలోడీస్ కాకుండా మరో రెండు తెలుగు చిత్రాలు చేసింది వర్ష. ఇక రీసెంట్ గా వర్ష గూగుల్ లో తన ఏజ్ తప్పుగా ఉన్న విషయాన్ని ధృవీకరించింది.

సాధారణంగా హీరోయిన్లు తమ వయసును బయటపెట్టడానికి ఇష్టపడరు. కానీ వర్ష మాత్రం తన వయసును చెప్పేసింది. రీసెంట్ గా ఫ్యాన్స్ తో ఇన్స్టాగ్రామ్ లైవ్ సెషన్ ను నిర్వహించగా ఒక అభిమాని ఆమె వయసు గూగుల్ లో 25 చూపిస్తోంది అని చెప్పగా దానికి వర్ష తనకిప్పుడు 24 ఏళ్ళు అని చెప్పింది.

“నేను 1996లో పుట్టాను. అంటే నాకు 24 సంవత్సరాలు. కానీ ఏం చేస్తాం, గూగుల్ కు మా అమ్మ కన్నా నా గురించి బాగా తెలుసు” అని ఫన్నీగా రిప్లై ఇచ్చింది.