బిగ్ బాస్ లో వరుణ్, వితికల పారితోషికం ఎంతో తెలుసా?


Varun Sandesh And Vithika Sheru
బిగ్ బాస్ లో వరుణ్, వితికల పారితోషికం ఎంతో తెలుసా?

వరల్డ్స్ బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ ప్రస్తుతం తెలుగులో మూడో సీజన్ లో ఉంది. ఇప్పటికే సగానికి పైగా సీజన్ ముగిసింది. కొంతమంది ప్రముఖులు ఇప్పటికే షో నుండి ఎలిమినేట్ అయ్యారు. తొలిసారి తెలుగు బిగ్ బాస్ లో ఒక జంట పార్టిసిపేట్ చేస్తోంది. వారే వరుణ్ మరియు వితిక. వీరిద్దరూ కూడా హౌజ్ లో ఎంటర్టైన్మెంట్ కు కొదవ లేకుండా ప్రేక్షకులను అలరిస్తూ దూసుకుపోతున్నారు.

అయితే బిగ్ బాస్ లో పాల్గొనే పార్టిసిపెంట్స్ కు భారీ రేంజ్ లో పారితోషికాలు ఇస్తారన్న విషయం తెల్సిందే. సెలబ్రిటీ కపుల్ జంట వరుణ్, వితికలకు కూడా భారీ మొత్తమే ముట్టినట్టు తెలిసింది. ఇద్దరికీ కలిపి బిగ్ బాస్ లో పాల్గొంటున్నందుకు 28 లక్షలు ఇచ్చినట్లు సమాచారం. ఒకవేళ ఇద్దరూ ఫైనల్స్ కు వెళితే పారితోషికం మరింత పెరిగేలా డీల్ సెట్ చేసుకున్నారు. ఈ వారం వరుణ్ నామినేట్ కాలేదు, అలాగే వితిక కెప్టెన్ కాబట్టి నామినేట్ చేయలేదు. దీంతో ఈ వారం కూడా వారు ఇంట్లో కొనసాగనున్నారు.