వ‌రుణ్ సందేశ్ ఈ సారైనా నిల‌బ‌డ‌తాడా?

వ‌రుణ్ సందేశ్ ఈ సారైనా నిల‌బ‌డ‌తాడా?
వ‌రుణ్ సందేశ్ ఈ సారైనా నిల‌బ‌డ‌తాడా?

హ్యాపీడేస్, కొత్త బంగారు లోకం, కుర్రాడు, మ‌రో చ‌రిత్ర వంటి చిత్రాల‌తో హీరోగా టాలీవుడ్‌లో మంచి గుర్తింపున‌రి సొంతం చేసుకున్నారు హీరో వ‌రుణ్ సందేశ్ కొంత విరామం త‌రువాత మ‌ళ్లీ సెకండ్ ఇన్నింగ్స్ మొద‌లుపెడుతున్నాడు. ఆయ‌న న‌టిస్తున్న తాజా చిత్రం `ఇందువ‌ద‌న‌`. ఎమ్‌.ఎస్‌.ఆర్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. ఫ‌ర్నాజ్‌శెట్టి క‌థానాయిక‌గా న‌టిస్తోంది. శ్రీ‌బాలాజీ పిక్చ‌ర్స్ బ్యాన‌ర్‌పై నైనిష్య అండ్ సాత్విక స‌మ‌ర్ప‌ణ‌లో శ్రీ‌మ‌తి మాధ‌వి ఆదుర్తి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

క‌ళాత్మ‌క ప్రేమ‌క‌థ‌గా తెర‌కెక్కుతున్న ఈ మూవీ విభిన్న క‌థ‌, క‌థ‌నాల‌తో రూపొందుతోంది. సోమ‌వారం ఈ మూవీ ఫ‌స్ట్ లుక్‌ని మేక‌ర్స్ విడుద‌ల చేశారు. ఫ‌స్ట్ లుక్ క‌ళాత్మ‌కంగా వుండ‌టం, వ‌రుణ్ సందేశ్ స‌రికొత్త మేకోవ‌ర్‌తో, ఫ‌ర్నాజ్‌శెట్టి యెద‌పై ఎలాంటి డ్రెస్ లేకుండా కాట‌న్ సారీని ధ‌రించి వ‌రుణ్‌ని త‌న్మ‌య‌త్వంతో ఆలింగ‌నం చేసుకుంటున్న తీరు సినిమాపై అంచ‌నాల్ని పెంచేస్తోంది.

గ‌త అనుభ‌వాల‌ని దృష్టిలో పెట్టుకుని వ‌రుణ్ సందేశ్ చేస్తున్న ఈ మూవీతో అయినా నిల‌బ‌డ‌తాడా? అన్న‌ది వేచి చూడాల్సిందే. స‌రికొత్త క‌థ‌, క‌థ‌నాల‌తో రూపొందుతున్న ఈ చిత్రానికి క‌థ‌, స్క్రీన్‌ప్లే, మాట‌లు స‌తీష్ ఆకేటి, శివ కాకాని సంగీతం, కోట‌గిరి వెంక‌టేశ్వ‌ర‌రావు ఎడిటింగ్‌ అందిస్తున్నారు. ర‌ఘుబాబు, అలీ, నాగినీడు, సురేఖావాణి, ధ‌న‌రాజ్‌, తాగుబోతు ర‌మేష్‌, మ‌హేష్ విట్ట‌, పార్వ‌తీశం, దువ్వాసి మోహ‌న్ త‌దిత‌రులు ఇత‌ర‌ పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు.