వరుణ్, శివజ్యోతిలు స్టార్ ఆఫ్ ది హౌస్.. స్పెషల్ ట్రీట్మెంట్


varun shivajyoti became star of the house
varun shivajyoti became star of the house

నిన్న నాగార్జున బిగ్ బోస్ హౌజ్ లోకి ఎంటరవ్వడంతో ఎంటర్టైన్మెంట్ మాములుగా లేదు. ప్రతీ సీజన్ లో హోస్ట్ ఒకరోజు హౌజ్ లోకి ఎంటరై హౌజ్ మేట్స్ తో కలిసి సందడి చేస్తారు. అలాగే ఈ సీజన్ లో నాగార్జున నిన్న హౌజ్ లోకి వెళ్లి పార్టిసిపెంట్స్ చేత ఫన్నీ టాస్క్ లు ఆడించి ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఇచ్చాడు.

ఈ క్రమంలో బిగ్ బాస్ లో స్టార్ ఆఫ్ ది హౌజ్ ఎవరో ఒక్కో కంటెస్టెంట్ చెప్పాలని, వారికి స్పెషల్ డిన్నర్ ఈ వారం మొత్తం లభిస్తుందని చెప్పారు. అయితే ఇప్పటికే బిగ్ బాస్ లో ఎవరికి వారు గ్రూపులుగా విడిపోవడంతో ఒకరికి ఒకరు స్టార్ లు ఇచ్చుకున్నారు. మొదటి అలీ, శివజ్యోతికి స్టార్ ఆఫ్ ది హౌజ్ ట్యాగ్ ఇవ్వగా, శివజ్యోతి అలీకి ఇచ్చింది. అలాగే బాబా భాస్కర్, శ్రీముఖికి.. శ్రీముఖి, బాబా భాస్కర్ కి ఇచ్చారు. ఇక వరుణ్, వితికల గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఒకరికి ఒకరు స్టార్ ఆఫ్ ది హౌజ్ అనే ట్యాగ్ ఇచ్చుకున్నారు.

ఈ నేపథ్యంలో ఒక్క ఓట్ కూడా పడని మహేష్, రాహుల్ లు శ్రీముఖి, వరుణ్ లను స్టార్ ఆఫ్ ది హౌజ్ గా ఎన్నుకోవడంతో వారికి ఎక్కువ ఓట్లు వచ్చాయి. వరుణ్, శివజ్యోతి స్టార్ ఆఫ్ ది హౌజ్ లుగా నిలిచారు. ఇది అయిపోయాక పార్టిసిపెంట్స్ అందరి చేత ఫన్నీ టాస్క్ లు చేయించడంతో నిన్నటి ఎపిసోడ్ ముగిసింది. రోజురోజుకూ బిగ్ బాస్ లో పోటీ పెరుగుతోంది. ఈరోజు కుండ బద్దలు కొట్టే టాస్క్  పెట్టారు. దీంతో హౌజ్ మేట్స్ మధ్య మరింత దూరం పెరగనుంది.