వరుణ్ తేజ్ 10, అనౌన్స్మెంట్ వచ్చేసింది


Varun Tej 10 movie announced formally
Varun Tej 10 movie announced formally

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ విభిన్న చిత్రాలతో కెరీర్ లో ఒక్కో మెట్టూ ఎక్కుతూ ముందుకు వెళుతున్న విషయం తెల్సిందే. అటు ఫీల్ గుడ్ మూవీస్, ఇటు స్పేస్ థ్రిల్లర్, రొమాంటిక్ ఎంటర్టైనర్, యాక్షన్ మూవీ, నెగటివ్ షేడ్స్, కామెడీ ఎంటర్టైనర్ ఇలా సినిమా సినిమాకి జోనర్ మార్చుకుంటూ వెళ్తున్న వరుణ్ తాను ఎలాంటి సినిమానైనా చేయగలనని నిరూపిస్తున్నాడు.

ఇటీవలే గద్దలకొండ గణేష్ తో సూపర్ హిట్ అందుకున్న వరుణ్ నెక్స్ట్ సినిమా ప్రకటన వచ్చేసింది. ముందు నుండి చెప్తున్నట్టుగానే వరుణ్ తన తర్వాతి సినిమా ఒక స్పోర్ట్స్ డ్రామా. ఇందులో వరుణ్, బాక్సర్ గా కనిపించనున్నాడు. వరుణ్ తేజ్ 10వ చిత్రాన్ని అనౌన్స్ చేస్తూ ఒక పోస్టర్ కూడా వదిలారు. ఇందులో బాక్సింగ్ గ్లోవ్స్ వేసుకుని పంచ్ ఇస్తున్నట్టుగా ఉంది.

కిరణ్ కొర్రపాటి దర్శకుడిగా పరిచయమవుతున్న ఈ చిత్రాన్ని రినైజన్స్ సినిమాస్, బీడబ్ల్యూసీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్స్ నిర్మించనున్నాయ్. అల్లు అరవింద్ సమర్పణలో సిద్ధూ ముద్దా, అల్లు వెంకటేష్ (అల్లు అర్జున్ అన్నయ్య) ఈ చిత్రాన్ని నిర్మిస్తారు. థమన్ సంగీత దర్శకుడిగా ఎంపికయ్యారు. డిసెంబర్ నుండి షూటింగ్ మొదలుకానున్న ఈ చిత్రంలో నటించే నటీనటులు, పనిచేసే సాంకేతిక నిపుణుల వివరాలు త్వరలోనే వెల్లడిస్తారు.