మెగా హీరోల మ‌ల్టీస్టార‌ర్ రాబోతోందా?మెగా హీరోల మ‌ల్టీస్టార‌ర్ రాబోతోందా?
మెగా హీరోల మ‌ల్టీస్టార‌ర్ రాబోతోందా?

మెగా హీరోలు ఇద్ద‌రు క‌లిసి మల్టీస్టార‌ర్ చిత్రం చేయ‌బోతున్నారా? అంటే అవున‌నే స‌మాధానం వినిపిస్తోంది. వ‌రుణ్‌తేజ్‌, సాయిధ‌ర‌మ్‌తేజ్ ఈ ఇద్ద‌రు హీరోలు క‌లిసి త్వ‌ర‌లో ఓ భారీ మ‌ల్టీస్టార‌ర్ చేయ‌బోతున్నార‌ట‌. ఈ విష‌యాన్ని హీరో వ‌రుణ్ తేజ్ వెల్ల‌డించాడు. ప్ర‌స్తుతం సాయిధ‌ర‌మ్‌తేజ్ `సోలో బ్ర‌తుకే సోలో బెట‌ర్‌` చిత్రంలో న‌టిస్తున్నాడు.

మ‌రో ప‌క్క బాక్సింగ్ నేప‌థ్యంలో వ‌రుణ్‌తేజ్ ఓ సినిమా చేస్తున్న విష‌యం తెలిసిందే. కిర‌ణ్ కొర్ర‌పాటి దర్శ‌కుడిగా ప‌రిచ‌యం అవుతున్న ఈ చిత్ర రెగ్యుల‌ర్ షూటింగ్ ఫిబ్ర‌వ‌రిలో వైజాగ్‌లో మొద‌లైంది. ప్ర‌స్తుతం క‌రోనా వైర‌స్ కార‌ణంగా షూటింగ్‌కి బ్రేకిచ్చారు., ప్ర‌స్తుతం ఇంటికే ప‌రిమిత‌మైపోయిన వ‌రుణ్‌తేజ్ తాజాగా సోష‌ల్ మీడియా వేదిక‌గా ఫ్యాన్స్‌తో చిట్ చాట్‌లో పాల్గొన్నారు. ఆస్క్ వ‌రుణ్‌ పేరుతో నిర్వ‌హించిన ఈ కార్య‌క్ర‌మ‌లో ఫ్యాన్స్ వ‌రుణ్‌ని ప‌లు ఆస‌క్తిక‌ర ప్ర‌శ్న‌లు అడిగారు.

అయితే ఓ అభిమాని సాయిధ‌ర‌మ్‌తేజ్‌, వ‌రుణ్‌తేజ్ క‌లిసి వున్న ఓ ఫొటోని ట్యాగ్ చేస్తూ మీ ఇద్ద‌రూ క‌లిసి మ‌ల్టీస్టార‌ర్ చేయాల‌ని ఎదురుచూస్తున్నాం` అని ట్వీట్ చేశాడు. దీనికి వ‌రుణ్ తేజ్ `ఖచ్చితంగా చేస్తాం.  ఆసక్తికరమైన విషయం వినడానికి వేచి వుండండి` అని ట్వీట్ చేశాడు. దీంతో వ‌రుణ్‌తేజ్ సాయిధ‌ర‌హ్ తేజ్‌ల మ‌ల్టీస్టార‌ర్ రావ‌డం ఖాయం అని అర్థ‌మైపోయింది.