మెగాప్రిన్స్ మూవీ స్టార్ట‌య్యేది అప్పుడేVarun Tej boxer goes on flors this date
Varun Tej boxer goes on flors this date

మెగా ప్రిన్స్ వ‌రుణ్‌తేజ్ కెరీర్ ప్రారంభం నుంచి విభిన్న‌మైన చిత్రాల్నిఎంచుకుంటూ వ‌రుస విజ‌యాల్ని సొంతం చేసుకుంటున్నారు. `గ‌ద్ద‌ల‌కొండ గ‌ణేష్‌` చిత్రం త‌రువాత ఆయ‌న న‌టిస్తున్నతాజా చిత్రం `బాక్స‌ర్‌`. కిరణ్ కొర్ర‌పాటి ఈ చిత్రం ద్వారా ద‌ర్శ‌కుడిగా పరిచ‌యం కాబోతున్నారు. రినైసెన్స్‌ బ్యాన‌ర్‌పై అల్లు అర‌వింద్ స‌మ‌ర్ప‌ణ‌లో అల్లు వెంక‌టేష్, సిద్దూ ముద్దా సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అత్యంత భారీ బ‌డ్జెట్ తో తెర‌పైకి రాబోతున్న ఈ చిత్రంలో వ‌రుణ్‌తేజ్ బాక్సార్‌గా క‌నిపించ‌బోతున్న విష‌యం తెలిసిందే.

ఇందు కోసం అమెరికా వెళ్లి అక్క‌డే బాక్సీంగ్‌లో ప్ర‌త్యేక శిక్ష‌ణ కూడా తీసుకున్నారు వ‌రుణ్‌తేజ్‌. హాలీవుడ్ స్టంట్ కొరియోగ్రాఫ‌ర్ లార్నెల్ స్టోవాల్ ఫైట్స్ కంపోజ్ చేస్తున్నారు. ఫైన‌ల్ స్క్రిప్ట్‌ని లాక్ చేసిన మేక‌ర్స్ ప్రీ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాల్ని స్పీడ‌ప్ చేశారు. వ‌రుణ్ న‌టిస్తున్న 10వ చిత్రం కావ‌డంతో ప్ర‌తి విష‌యంలోనూ మేక‌ర్స్ చాలా జాగ్ర‌త్త‌లు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగానే కీల‌క పాత్ర కోసం బాలీవుడ్ హీరో సునీల్ శెట్టిని రంగంలోకి దింపిన‌ట్టు తెలుస్తోంది.

ఇటీవ‌ల ర‌జ‌నీకాంత్ న‌టించిన `ద‌ర్బార్ చిత్రంలో సునీల్‌శెట్టి విల‌న్‌గా న‌టించిన విష‌యం తెలిసిందే. త‌మ‌న్ సంగీతం, జార్జ్ సి. విలియ‌మ్స్ ఫొటోగ్ర‌ఫీ అందించ‌నున్న ఈ చిత్రాన్ని ఫిబ్ర‌వ‌రి 17న వైజాగ్‌లో చిత్ర బృందం ప్రారంభించ‌బోతోంది. ఇందు కోసం ఇప్ప‌టికే ఏర్పాట్లు పూర్తి చేసిన‌ట్లు చిత్ర వ‌ర్గాల స‌మాచారం.