వ‌రుణ్‌తేజ్ `బాక్స‌ర్` అక్క‌డ‌ మొద‌లైంది!


Varun Tej boxer shooting Started
Varun Tej boxer shooting Started

ఎఫ్‌2, గ‌ద్ద‌లకొండ గ‌ణేస్ వంటి వ‌రుస హిట్‌ల‌తో దూసుకుపోతున్నారు వ‌రుణ్‌తేజ్‌. ఈ రెండు చిత్రాల స‌క్సెస్‌తో రెట్టించిన ఆనందంలో వున్న వ‌రుణ్‌తేజ్ కొత్త ద‌ర్శ‌కుడితో స్పోర్ట్స్ డ్రామాని చేయ‌బోతున్న విష‌యం తెలిసిందే. ఇ్దులో వ‌రుణ్ బాక్స‌ర్‌గా క‌నిపించ‌బోతున్నారు. సాయి కొర్ర‌పాటి ద‌ర్శ‌కుడిగా ప‌రియం కాబోతున్నాడు. అల్లు అర‌వింద్ పెద్ద కుమారుడు అల్లు వెంక‌టేష్ ఈ సినిమాతో నిర్మాత‌గా మారుతున్నారు.

`బాక్స‌ర్‌` పేరుతో రూపొంద‌నున్న ఈ చిత్రం ఇటీవ‌లే ప్రారంభం కావాల్సి వుంది. అయితే హీరో వ‌రుణ్‌తేజ్ బాక్సింగ్‌లో ప్రాప‌ర్‌గా శిక్ష‌ణ తీసుకోక‌పోవ‌డంతో షూటింగ్ ఆల‌స్యమ‌వుతూ వ‌స్తోంది. ఇందు కోసం అమెరికాలోని లాస్ ఏంజిల్స్‌లో ప్ర‌త్యేక శిక్ష‌ణ పొందిన వ‌ర‌న్‌తేజ దీంతో సినిమా షూటింగ్ త్వ‌ర‌లోనే మొద‌ల‌వుతుంద‌ని అంతా భావించారు. తాజాగా ఆ మూవీ రెగ్యుల‌ర్ షూటింగ్ సోమ‌వారం వైజాగ్‌లో ప్రారంభ‌మైంది. ఈ విష‌యాన్ని హీరో వ‌రుణ్ సోష‌ల్ మీడియా ద్వారా వెల్ల‌డించారు. సినిమాలో ఐజాగ్‌లో ప్రారంభ‌మైంద‌ని, ప్ర‌తీ ఒక్క‌రి ఆశీస్సులు కావాలని ఈ సంద‌ర్భంగా వ‌రుణ్‌తేజ్ ట్వీట్ చేశాడు.

త‌మ‌న్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రంలో వ‌రుణ్‌తేజ్‌కు జోడీగా `ద‌బాంగ్ 3` ఫేమ్ స‌యీ ముఖ‌ర్జీని ఎంపిక చేసిన‌ట్టు తెలిసింది. త్వ‌ర‌లోనే ఈ విష‌యాన్ని చిత్ర బృందం అధికారికంగా వెల్ల‌డించ‌నున్న‌ట్టు చిత్ర వ‌ర్గాల స‌మాచారం.