వరుణ్ తేజ్ 5 ఏళ్ళు.. 10 సినిమాలువరుణ్ తేజ్ 5 ఏళ్ళు.. 10 సినిమాలు
వరుణ్ తేజ్ 5 ఏళ్ళు.. 10 సినిమాలు

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కెరీర్ లో పైకి ఒక్కో మెట్టూ ఎక్కుతున్నాడు. మెగా ఫ్యామిలీ నుండి వచ్చినా వరుణ్ కు అదిరిపోయే రేంజ్ డెబ్యూ దొరకలేదు. ముకుంద వంటి క్లాస్ ఫిల్మ్ తో సాదాసీదా ఎంట్రీ ఇచ్చాడు వరుణ్. ఈ సినిమా హిట్ అవ్వకపోయినా వరుణ్ హీరో కన్నా నటుడు అనిపించుకోవడానికి ఇష్టపడతాడని ప్రూవ్ అయింది.

అప్పటినుండి విభిన్న చిత్రాలే తన దారి అని చెప్పుకున్న వరుణ్, సినిమా సినిమాకి వ్యత్యాసం చూపిస్తూ వస్తున్నాడు. ఈ క్రమంలో వచ్చినవే ఫిదా, తొలిప్రేమ, ఎఫ్ 2 వంటి విజయాలు. మధ్యలో లోఫర్, మిస్టర్ అంటూ ప్లాపులు కొట్టినా అది కెరీర్ కు ఎఫెక్ట్ కాకుండా చూసుకున్నాడు. వరుణ్ తేజ్ ఇండస్ట్రీకి వచ్చి ఐదేళ్లు అవుతోంది. రీసెంట్ గా తన పదో సినిమా లాంచ్ చేసాడు.

స్టార్ హీరోలు ఇంకా 25, 20, 18 సినిమాల దగ్గర ఉంటే వరుణ్ అప్పుడే 10 సినిమాలు పూర్తి చేసుకోవడం విశేషమే. ఇప్పుడు వరుణ్ సినిమాలు ఈజీగా 30 కోట్లు బిజినెస్ చేస్తున్నాయి, టాక్ బాగుంటే రికవర్ చేసుకోగలుగుతున్నాయి. ప్రస్తుతం తన 10వ సినిమాను బాక్సింగ్ నేపధ్యమున్న కథ ఎంచుకున్నాడు. ఈ సినిమా కోసం సరికొత్త లుక్ కోసం ట్రై చేస్తున్నాడు. బాడీ కూడా పెంచుతున్నాడు.