`భీష్మ‌` విజ‌యోత్స‌వానికి మెగా హీరో చీఫ్ గెస్ట్‌!

`భీష్మ‌` విజ‌యోత్స‌వానికి మెగా హీరో చీఫ్ గెస్ట్‌!
`భీష్మ‌` విజ‌యోత్స‌వానికి మెగా హీరో చీఫ్ గెస్ట్‌!

నితిన్ హీరోగా న‌టించిన తాజా చిత్రం `భీష్మ‌`. సింగిల్ ఫ‌ర్ ఎవ‌ర్ అనే ట్యాగ్ లైన్‌తో ఈ నెల 21న విడుద‌లైన‌ ఈ చిత్రం తొలి రోజు తొలి షో నుంచే మంచి టాక్‌ని సొంతం చేసుకుంది. `ఛ‌లో`తో తొలి విజ‌యాన్ని సొంతం చేసుకున్న వెంకీ కుడుములకు ఈ సినిమా కూడా విజ‌యాన్ని అందించి ద్వితీయ విగ్నాన్ని నిర్వ‌గ్నంగా అధిగ‌మించేలా చేసింది. చాలా కాలంగా హిట్ కోసం ఎదురుచూస్తున్న నితిన్‌కు మర్చిపోలేని విజ‌యాన్ని అందించింది.

ఉభ‌య తెలుగు రాష్ట్రాల‌తో పాటు యుఎస్‌లోనూ బ్రేక్ ఈవెన్ దిశ‌గా ప‌య‌నిస్తూ వ‌సూళ్ల వ‌ర్షాన్ని కురిపిస్తోంది. హీరో నితిన్‌, ర‌ష్మిక‌ల ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ, వెంకీ కుడుముల టేకింగ్‌, పంచ్ డైలాగ్స్, మ‌హ‌తి స్వ‌ర‌సాగ‌ర్ సంగీతం ఆక‌ట్టుకోవ‌డంతో ఈ చిత్రానికి ప్రేక్ష‌కులు బ్ర‌హ్మ‌ర‌థం ప‌డుతున్నారు. దీంతో టీమ్ సెల‌బ్రేష‌న్స్ మోడ్‌లోకి వెళ్లిపోయింది.

ఇటీవ‌లే స‌క్సెస్ మీట్‌ని నిర్వ‌హించిన `భీష్మ‌`టీమ్ ఈ నెల 29న వైజాగ్‌లోని గుర‌జాడ క‌ళాక్షేత్రంలో `భీష్మ‌` విజ‌యోత్స‌వ సంబ‌రాన్ని జ‌ర‌పుకోబోతోంది. ఇందు కోసం భారీగా ఏర్పాట్లు కూడ మొద‌లుపెట్టేశారు. ఈ కార్య‌క్ర‌మంలో హీరో నితిన్‌తో పాటు హీరోయిన్ చిత్ర బృందం పాల్గొన‌బోతున్నారు. ఈ భారీ ఈ వెంట్‌కి మెగా హీరో వ‌రుణ్‌తేజ్ ముఖ్య అతిథిగా పాల్గొన‌బోతున్నాడు. ప్ర‌స్తుతం వ‌రుణ్‌తేజ్ న‌టిస్తున్న `బాక్స‌ర్` వైజాగ్‌లో షూటింగ్ జ‌రుపుకుంటోంది. మెగా హీరో రాక‌తో ఈ ఈవెంట్ కొత్త ఇండికేష‌న్స్ ఇవ్వ‌బోతోంది.