వరుణ్ తన పారితోషికాన్ని డబల్ చేసేసాడుగావరుణ్ తన పారితోషికాన్ని డబల్ చేసేసాడుగా
వరుణ్ తన పారితోషికాన్ని డబల్ చేసేసాడుగా

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కెరీర్ పరంగా దూసుకుపోతున్నాడు. ఒక సినిమాకు మరొక సినిమాకు సంబంధం లేకుండా హిట్లు కొట్టి చూపిస్తున్నాడు. ఈ మధ్య కాలంలో ఒక్క అంతరిక్షం తప్పితే వరుణ్ సినిమా ఏదీ డిస్ట్రిబ్యూటర్లకు నష్టాలను తీసుకురాలేదు. దాంతో ట్రేడ్ వరుణ్ ను నమ్ముతోంది. అతని సినిమా అంటే ఏ మాత్రం ఆలోచించకుండా 30 కోట్ల వరకూ పెట్టుబడి పెట్టొచ్చని నిర్మాతలు కూడా భావిస్తున్నారు.

ప్రస్తుతం ఒక స్పోర్ట్స్ డ్రామా చేస్తున్న వరుణ్ తన రీసెంట్ హిట్స్ కారణంగా పారితోషికాన్ని డబల్ చేసినట్లు తెలుస్తోంది. గద్దలకొండ గణేష్ కు ముందు 3-4 కోట్ల రేంజ్ లో ఉన్న వరుణ్ పారితోషికం, ఆ సినిమా సాధించిన హిట్ తర్వాత 7-8 కోట్ల రేంజ్ కు చేరుకుంది. ఒక్క సినిమాతో పారితోషికాన్ని డబల్ చేసేసాడు వరుణ్.

తనకంటే ముందొచ్చిన యువ హీరోలను దాటి మీడియం రేంజ్ హీరో స్టేజ్ కు చేరుకున్న వరుణ్, టాప్ లీగ్ లోకి వెళ్లాలని ఆశపడుతున్నాడు. అందుకు ఇప్పుడు తాను ఎంచుకున్న స్పోర్ట్స్ డ్రామా సరైనదని భావిస్తున్నాడు. అవ్వడానికి కొత్త దర్శకుడైనా అన్ని కమర్షియల్ అంశాలను జోడించి ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నాడట. వరుణ్ ఇప్పటికే రెండు నెలల బాక్సింగ్ ట్రైనింగ్ కోసం ముంబై వెళ్ళాడు.