మెగా హీరో మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్Varun tej green signal for another project
Varun tej green signal for another project

మెగా హీరో వరుణ్ తేజ్ మరో ప్రాజెక్ట్ ని ఒకే చేసినట్లు తెలుస్తోంది. F2 అనంతరం రెమ్యునరేషన్ ని పెంచిన ఈ మెగా హీరో తన రేంజ్ కి తగ్గ కథలని ఒకే చేస్తున్నాడు. అయితే గడ్డలకొండ గణేష్ మాత్రం అనుకున్నంతగా సక్సెస్ కాలేదు. హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఆ సినిమా పాజిటివ్ టాక్ అందుకున్నప్పటికీ కమర్షియల్ గా ఊహించినంత లాభాల్ని అయితే ఇవ్వలేదు.

ఇకపోతే రీసెంట్ గా వరుణ్ మరో నిర్మాతతో సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. కంచె నిర్మాత రాజివ్ రెడ్డి వరుణ్ తో గత ఏడాది అంతరిక్షం సినిమాను నిర్మించిన విషయం తెలిసిందే. అయితే ఆ రెండు సినిమాలు కూడా బాక్స్ ఆఫీస్ వద్ద పెద్దగా కెలెక్షన్స్ ఏమి రాబట్టలేదు. ముఖ్యంగా అంతరిక్షం సినిమా అయితే పెట్టిన బడ్జెట్ ని కూడా వెనక్కి తేలేకపోయింది. ఇక ఆయనతో ఎలాగైనా ఓ మంచి సినిమా చేసి సక్సెస్ అందుకోవాలని వరుణ్ డిసైడ్ అయ్యాడట.

దర్శకుడు ఎవరనేది తెలియాల్సి ఉంది. త్వరలో ఈ కొత్త సినిమాపై అఫీషియల్ ఎనౌన్స్మెంట్ వెలువడనుంది. ప్రస్తుతం వరుణ్ బాక్సింగ్ నేపథ్యంలో ఒక సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. కిరణ్ కొర్రపాటి  దర్శకత్వంలో తెరకెక్కనున్న ఆ చిత్రాన్ని రినైజన్స్ సినిమాస్, బీడబ్ల్యూసీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్స్ నిర్మించనున్నాయ్. డిసెంబర్ నుంచి ఈ ప్రాజెక్ట్ రెగ్యులర్ షూటింగ్ మొదలుకానుంది.