మెగా ప్రిన్స్ చ‌మ‌టోడుస్తున్నాడుగా!


Varun tej hard workouts for his upcoming film?
Varun tej hard workouts for his upcoming film?

`అర్జున్‌రెడ్డి` త‌రువాత తెలుగు సినిమా స్వ‌రూప‌మే మారిపోయింది. రెగ్యుల‌ర్ క‌మ‌ర్షియ‌ల్ చిత్రాల‌ని ప్రేక్ష‌కులు ఇప్పుడు ఇష్ట‌ప‌డ‌టం లేదు. ఏదైనా కొత్త‌గా వుంటే, ఎవ‌రైనా కొత్త‌గా చేశారంటేనే థియేట‌ర్ల‌కు వ‌స్తున్నారు. దీంతో ప్ర‌తీ హీరో ప్రేక్ష‌కుల్ని మెప్పించ‌డం కోసం శ్ర‌మించాల్సి వ‌స్తోంది. మెగా ప్రిన్స్ ప్ర‌స్తుతం అదే ప‌నిలో వున్నారు. కొత్త త‌ర‌హా చిత్రాల్ని ఎంచుకుంటూ ఆక‌ట్టుకుంటున్న వ‌రుణ్‌తేజ్ తాజాగా కొత్త త‌ర‌హా చిత్రానికి గ్రీన్‌సిగ్న‌ల్ ఇచ్చారు.

అంత‌రిక్షం 9000 KMPH, ఎఫ్‌2, గ‌ద్ద‌ల‌కొండ గ‌ణేష్ చిత్రాల త‌రువాత న‌టిస్తున్న సినిమా కావ‌డంతో ఈ చిత్రం కోసం హీరో వ‌రుణ్‌తేజ్ ప్ర‌త్యేకంగా కేర్ తీసుకుంటున్నార‌ట‌. కిర‌ణ్ కొర్ర‌పాటి ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం కాబోతున్న ఈ చిత్రాన్ని అల్లు అర్జున్ బ్ర‌ద‌ర్ అల్లు వెంక‌టేష్ నిర్మిస్తున్నారు. ఇటీవ‌లే పూజా కార్య‌క్ర‌మాలు జ‌రుపుకున్న ఈ చిత్ర రెగ్యుల‌ర్ షూటింగ్ త్వ‌ర‌లో ప్రారంభం కానుంది. ఇందులో వ‌రుణ్ బాక్స‌ర్‌గా క‌నిపించ‌బోతున్నారు.

ఇందు కోసం అమెరికా వెళ్లిన వ‌రుణ్ అక్క‌డ బాక్సింగ్‌లో ప్ర‌త్యేక శిక్ష‌ణ తీసుకున్నార‌ట‌. హైద‌రాబాద్‌లోనూ ఓ కోచ్ నేతృత్వంలో మ‌రిన్ని మెల‌కువ‌లు తీసుకుంటున్నారు. నిత్యం జిమ్‌లో వుంటూ వ‌ర్క‌వుట్‌లు చేస్తూ త‌న పాత్ర కోసం చ‌మ‌టోడుస్తున్నారు. ఈ సినిమా కోసం హాలీవుడ్ స్టంట్ డైరెక్ట‌ర్ లోర్నెల్ స్టొవ‌ల్‌ని తీసుకొస్తున్నార‌ట‌. దీంతో ఈ సినిమా ఓ రేంజ్‌లో వుండ‌బోతోంద‌ని అర్థ‌మ‌వుతోంది.

 

View this post on Instagram

 

Sweat.Smile.Repeat. #workoutmotivation

A post shared by Varun Tej Konidela (@varunkonidela7) on