హ్యాట్రిక్ మిస్ అయిన హీరో


Varun tej missed hattrick hits

ఫిదా , తొలిప్రేమ చిత్రాలతో వరుస విజయాలు సాధించిన మెగా హీరో వరుణ్ తేజ్ తాజాగా వచ్చిన అంతరిక్షం చిత్రంతో హ్యాట్రిక్ కొడతాడని అనుకున్నారు కానీ నిన్న విడుదలైన అంతరిక్షం చిత్రం ప్రేక్షకులను అలరించేలా లేకపోవడంతో ప్లాప్ దిశగా దూసుకుపోతోంది దాంతో హ్యాట్రిక్ మిస్ అయ్యాడు ఈ మెగా హీరో . ముకుంద చిత్రంతో హీరోగా పరిచయమైన వరుణ్ తేజ్ కు కెరీర్ మొదట్లో వరుస ప్లాప్ చిత్రాలు రావడంతో ఇబ్బంది పడ్డాడు .

అయితే కంచె చిత్రం వరుణ్ తేజ్ ని సరికొత్తగా ప్రెజెంట్ చేసింది , ఆ సినిమా ఇచ్చిన ఉత్సహంతో ఫిదా చేసాడు ప్రేక్షకులను . ఫిదా అతిపెద్ద హిట్ గా నిలిచింది వరుణ్ తేజ్ కెరీర్ లోనే అలాగే తొలిప్రేమ కూడా సూపర్ హిట్ అయ్యింది . ఫిదా , తొలిప్రేమ వరుస విజయాలు సాధించడంతో అంతరిక్షం తో హ్యాట్రిక్ ఖాయమని అనుకున్నారు కట్ చేస్తే అంతరిక్షం ప్లాప్ జాబితాలో చేరేలా ఉంది , దాంతో హ్యాట్రిక్ మిస్ అయ్యింది . సంకల్ప్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన అంతరిక్షం చిత్రం ఫస్టాఫ్ బాగానే ఉన్నప్పటికీ సెకండాఫ్ బోర్ సన్నివేశాలు ఎక్కువగా ఉండటంతో బాక్సాఫీస్ వద్ద చతికిలబడింది .

English Title: Varun tej missed hattrick hits