వరుణ్ తేజ్ ఆ భారాన్ని మోయగలడా?


Valmiki
Valmiki

మెగా హీరో వరుణ్ తేజ్  నటించిన తాజా చిత్రం వాల్మీకి. ఈ చిత్రంపై మెగా అభిమానుల్లో మంచి అంచనాలే ఉన్నాయి. ఇటీవలే కట్ చేసిన ట్రైలర్ కూడా ఆసక్తిని పెంచింది. వాల్మీకి తమిళ కల్ట్ హిట్ జిగర్తాండ చిత్రానికి రీమేక్ అన్న విషయం తెల్సిందే. అక్కడ విలన్ గా నటించిన బాబీ సింహ పాత్రను రక్తికట్టించడమే కాకండా తన పెర్ఫార్మన్స్ తో జాతీయ అవార్డును సైతం అందుకున్నాడు.

కన్నడలో ఇదే చిత్రం రీమేకై అక్కడ కూడా సూపర్ హిట్ గా నిలిచింది. బాబీ సింహ పోషించిన పాత్రను అక్కడ రవిశంకర్ చేసాడు. కన్నడలో కూడా ఆ పాత్రకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక్కడ బాబీ సింహకు ఎటువంటి ఇమేజ్ లేకపోవడంతో పాత్రను తీర్చిదిద్దడానికి స్వేచ్ఛ పెరిగింది. అలాగే రవిశంకర్ కు వయసు తగ్గ పాత్ర కావడంతో అక్కడా వర్కౌట్ అయింది. కానీ తెలుగులో అటువంటి పరిస్థితి లేదు. ఇక్కడ వరుణ్ తేజ్ రైజింగ్ స్టార్. సాఫ్ట్ ఇమేజ్ తో ఫిదా, ఎఫ్ 2 వంటి సక్సెస్ లు తన ఖాతాలో వేసుకున్నాడు. మరి తనకున్న ఇమేజ్ కు భిన్నంగా వెళ్లి వరుణ్ గద్దలకొండ గణేష్ పాత్రలో మెప్పించగలడా అన్నది చూడాలి.