ఎన్టీఆర్ బయోపిక్ ఆఫర్ ని రిజెక్ట్ చేసాడు


varun tej rejected ntr biopic ఎన్టీఆర్ బయోపిక్ చిత్రానికి అనూహ్యంగా రోజు రోజుకి క్రేజ్ పెరుగుతోంది దాంతో ఆ సినిమాలో నటించే ఛాన్స్ వస్తే ఎవరూ వదులుకోరు అలాంటిది ఓ యంగ్ హీరో మాత్రం ఎన్టీఆర్ బయోపిక్ లో నటించమని ఆఫర్ ఇస్తే వెంటనే రిజెక్ట్ చేసాడట ! ఇంతకీ ఆఫర్ వచ్చిన యంగ్ హీరో ఎవరు ? ఎందుకు ఆ ఆ పాత్రని చేయకుండా తిరస్కరించాడనే కదా మీ డౌట్ . మెగా హీరో వరుణ్ తేజ్ కి ఎన్టీఆర్ బయోపిక్ లో ఛాన్స్ వచ్చింది పైగా మెగాస్టార్ చిరంజీవి పాత్రని పోషించమని కోరారట ! అయితే అంతటి స్టార్ హీరో పాత్రని నేను చేయలేనని వెంటనే రిజెక్ట్ చేసాడట .

వరుణ్ తేజ్ – క్రిష్ ల కాంబినేషన్ లో ” కంచె ” చిత్రం రూపొందిన విషయం తెలిసిందే . వరుణ్ కెరీర్ లో కంచె ఆణిముత్యం లా నిలిచిపోయే సినిమా దాంతో చిరంజీవి పాత్ర కోసం వరుణ్ ని సంప్రదించారట అయితే అందుకు వరుణ్ నిరాకరించడంతో ఆ పాత్రలో మరొకరిని తీసుకోవడానికి సన్నాహాలు చేస్తున్నారు . ఎన్టీఆర్ బయోపిక్ శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది ఇప్పటికే పలువురు ప్రముఖ నటీనటులు ఈ సినిమాలో నటించగా మరికొందరు నటించడానికి ఆసక్తి చూపిస్తున్నారు . ఇక ఈ చిత్రానికి విపరీతమైన డిమాండ్ ఏర్పడింది బిజినెస్ వర్గాల్లో . వచ్చే ఏడాది 2019 జనవరి 9న సినిమాని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు .

English Title: varun tej rejected ntr biopic

varun tej rejected ntr biopic