బాలయ్యని తిట్టడంలో తప్పు లేదన్న వరుణ్ తేజ్Varun tej responds on nagababu comments

మా నాన్న నాగబాబు బాలయ్య ని తిట్టడంలో తప్పులేదు అని సమర్ధించాడు మెగా హీరో వరుణ్ తేజ్ . తాజాగా అంతరిక్షం చిత్రం కోసం ఇచ్చిన ఇంటర్వ్యూ లో వరుణ్ ఇలా దొరికిపోయాడు . అంతేకాదు అసలు బాలయ్య ని నాగబాబు ఎందుకు తిట్టాల్సి వచ్చిందో కూడా చెబుతున్నాడు . ఒక సందర్భంలో బాలయ్య పవన్ కళ్యాణ్ ని ఉద్దేశిస్తూ పవన్ కళ్యాణ్ ఎవరో నాకు తెలీదు అని అనడమే ఇందుకు కారణమని తేల్చి పడేసాడు . బాలయ్య ని ఎందుకు తిట్టావ్ నాన్న అని అడిగితే ఈ విషయం చెప్పాడని అందులో తప్పేమి లేదని సమర్ధిస్తున్నాడు వరుణ్ తేజ్ .

ఇటీవలే బాలయ్య ఎవరో నాకు తెలీదు అని నాగబాబు చెప్పి సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే . ఆ విషయం రచ్చ రచ్చ అయ్యింది . కట్ చేస్తే నాగబాబు పై బాలయ్య అభిమానులు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు . అయినప్పటికీ నాగబాబు మాత్రం ఎక్కడా తగ్గడం లేదు . నా తమ్ముడ్ని విమర్శిస్తే నేను సహించేది లేదు అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాడు నాగబాబు . దాన్ని సమర్ధిస్తున్నాడు వరుణ్ తేజ్ .

English Title: Varun tej responds on nagababu comments

Varun tej responds on nagababu comments