శ్రీరెడ్డి కి చురకలంటించిన మెగా హీరో వరుణ్


varun tej retort to srireddyబాబాయ్ పవన్ కళ్యాణ్ పై తీవ్ర విమర్శలు చేయడమే కాకుండా బూతులు తిట్టింది శ్రీరెడ్డి దాంతో మెగా ఫ్యాన్స్ శ్రీరెడ్డి పై ఆగ్రహంగా ఉన్నారు . ఇక బాబాయ్ ని పట్టుకొని అంతటి బూతు మాట అనడంతో శ్రీరెడ్డి పై పరోక్షంగా విమర్శలు చేసాడు , చురకలంటించాడు మెగా హీరో వరుణ్ తేజ్ . దాంతో అతడికి మెగా ఫ్యాన్స్ నుండి పెద్ద ఎత్తున మద్దతు లభిస్తోంది . పవన్ కళ్యాణ్ బాబాయ్ అంటే వరుణ్ కు అమితమైన ఇష్టం అలాంటిది బాబాయ్ ని బూతు మాట అనడంతో వరుణ్ బాగా హర్ట్ అయ్యాడు .

”నిన్ను విమర్శించి , నీ గురించి తక్కువ చేసే నీచ మనస్కుల గురించి నువ్ పట్టించుకోవాల్సిన అవసరమే లేదు , వాళ్ళ తప్పుల్ని తెలుసుకోకుండా ఎదుటి వాళ్ళను తప్పుడు వ్యక్తులుగా చూపించడానికి ఉత్సాహం చూపిస్తారు ” అంటూ పరోక్షంగా శ్రీరెడ్డి పై కామెంట్ చేసాడు వరుణ్ . శ్రీరెడ్డి లాంటి వాళ్ళు నిన్ను ఎన్ని మాటలన్నా పట్టించుకోవాల్సిన అవసరం లేదంటూ బాబాయ్ కు అండగా నిలిచాడు వరుణ్ తేజ్ . శ్రీరెడ్డి ఈ కామెంట్స్ చూస్తే వరుణ్ పై కూడా దాడి చేయడం ఖాయం .