మెగా హీరో కి షాక్ ఇచ్చిన మహేష్ హీరోయిన్


మెగా హీరో వరుణ్ తేజ్ కు షాక్ ఇచ్చింది మహేష్ బాబు హీరోయిన్ పూజా హెగ్డే . మహేష్ బాబు సరసన మహర్షి చిత్రంలో నటించిన పూజా హెగ్డే తాజాగా ప్రభాస్ సరసన జాన్ అనే చిత్రంలో నటిస్తోంది అలాగే అల్లు అర్జున్ సరసన మరోసారి నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది . అయితే వరుణ్ తేజ్ కు మాత్రం హ్యాండ్ ఇచ్చింది పూజా హెగ్డే . ఆల్రెడీ వరుణ్ తేజ్ హీరోగా నటించిన ముకుంద చిత్రంతోనే తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది ఈ భామ .

అయితే మళ్ళీ వరుణ్ తేజ్ సరసన ” వాల్మీకి ” చిత్రంలో నటించడానికి ముందు ఒప్పుకున్న ఈ భామ తీరా షూటింగ్ సమయానికి నా దగ్గర డేట్స్ అడ్జెస్ట్ కావడం లేదు అంటూ వరుణ్ తేజ్ కు షాక్ ఇచ్చింది . తమిళంలో విజయం సాధించిన జిగర్ తాండ చిత్రానికి రీమేక్ ఈ వాల్మీకి . హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతోంది . వరుణ్ కు నో చెప్పిన పూజా ప్రభాస్ , అల్లు అర్జున్ లను నమ్ముకుంది . మరి ఆ సినిమాలు ఏమౌతాయో !