ఆ ద‌ర్శ‌కుడికి మెగా ప్రిన్స్ మ‌ళ్లీ ఛాన్స్ ఇస్తున్నాడా?


ఆ ద‌ర్శ‌కుడికి మెగా ప్రిన్స్ మ‌ళ్లీ ఛాన్స్ ఇస్తున్నాడా?
ఆ ద‌ర్శ‌కుడికి మెగా ప్రిన్స్ మ‌ళ్లీ ఛాన్స్ ఇస్తున్నాడా?

ఎఫ్‌2, గ‌ద్ద‌ల‌కొండ గ‌ణేష్ వంటి వ‌రుస చిత్రాల‌తో సూప‌ర్ హిట్‌ల‌ని సొంతం చేసుకున్నారు హీరో వ‌రుణ్‌తేజ్‌. ప్ర‌స్తుతం `బాక్స‌ర్‌` చిత్రం కోసం రెడీ అవుతున్నారు. ఇటీవ‌ల ప్ర‌త్యేకంగా శిక్ష‌ణ తీసుకున్నా అది పూర్తి స్థాయిలో లేక‌పోవ‌డంతో మ‌ళ్లీ పూర్తి స్థాయిలో శిక్ష‌ణ తీసుకున్న త‌రువాత వ‌రుణ్‌తేజ్ `బాక్స‌ర్‌` రెగ్యుల‌ర్ షూటింగ్ ప్రారంభించ‌బోతున్నారు.

ఇదిలా వుంటే వ‌రుణ్ మ‌రో చిత్రాన్ని కూడా లైన్‌లో పెట్టిన‌ట్టు తెలుస్తోంది. త‌న‌ని `ముకుంద‌` చిత్రంతో హీరోగా ప‌రిచ‌యం చేసిన శ్రీ‌కాంత్ అడ్డాల ద‌ర్శ‌శ‌క‌త్వంలో ఈ సినిమా చేయ‌బోతున్నట్టు తెలిసింది. ప్ర‌స్తుతం శ్రీ‌కాంత్ అడ్డాల `అసుర‌న్‌` ఆధారంగా రూపొందుతున్న `నార‌ప్ప‌` రీమేక్‌కు ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. విక్ట‌రీ వెంక‌టేష్ న‌టిస్తున్న ఈ చిత్రం ప్ర‌స్తుతం చిత్రీక‌ర‌ణ ద‌శ‌లో వుంది. ఈ సినిమా పూర్తియిన త‌రువాత వ‌రుణ్ చిత్రాన్ని మ‌ద‌లుపెట్టే అవ‌కాశం వుంద‌ని తెలిసింది.

సీత‌మ్ వాకిట్తో సిరిమ‌ల్లె చెట్టు` వంటి ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్‌ని అందించి ప్ర‌శంస‌లు అందుకున్న శ్రీ‌కాంత్ అడ్డాల వ‌రుణ్ కోసం కూడా ఇదే త‌ర‌హా కుటుంబ క‌థా చిత్రాన్ని ప్లాన్ చేస్తున్నార‌ట‌. ఇటీవ‌లే క‌థ వినిపించాడ‌ని, వ‌రుణ్‌కు క‌థ న‌చ్చ‌డంతో గ్రీన్‌సిగ్న‌ల్ ఇచ్చాడ‌ని తెలిసింది.