షాకింగ్ న్యూస్: హీరో వరుణ్ తేజ్ కారు యాక్సిడెంట్


Varun Tej's Car Met With Accident

షాకింగ్ న్యూస్: హీరో వరుణ్ తేజ్ కారు యాక్సిడెంట్

భారీ యాక్సిడెంట్ నుండి తృటిలో తప్పించుకున్నారు హీరో వరుణ్ తేజ్. హైదరాబాద్ నుండి బెంగుళూరు కు కారులో ప్రయాణిస్తున్న వరుణ్ తేజ్ కారు కి యాక్సిడెంట్ జరిగింది. అయితే భారీ యాక్సిడెంట్ తృటిలో తప్పించుకొని విజేత గా నిలిచాడు వరుణ్ తేజ్. తృటిలో ఘోర ప్రమాదం నుండి బయట పడటంతో వరుణ్ తేజ్ షాక్ కి గురయ్యాడు.

తాజాగా ఈ హీరో హరీశ్ శంకర్ దర్శకత్వంలో వాల్మీకి చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఆ సినిమా షూటింగ్ లో పాల్గొనడానికి బెంగుళూరుకు బయలుదేరాడు కారులో . బెంగుళూరు హైవే రోడ్డులో వెళ్తున్న సమయంలో వనపర్తి జిల్లా 44 వ జాతీయ రహదారిపై ఈ సంఘటన జరిగింది. అయితే వరుణ్ తేజ్ కారు యాక్సిడెంట్ లో కారు దెబ్బతింది కానీ వరుణ్ తేజ్ కు పెద్దగా గాయాలు కాలేదు. దాంతో చిత్ర బృందం ఊపిరి పీల్చుకుంది.