వ‌రుణ్‌తేజ్ బ‌ర్త్‌డే స‌ర్‌ప్రైజ్ వ‌చ్చేసింది!


వ‌రుణ్‌తేజ్ బ‌ర్త్‌డే స‌ర్‌ప్రైజ్ వ‌చ్చేసింది!
వ‌రుణ్‌తేజ్ బ‌ర్త్‌డే స‌ర్‌ప్రైజ్ వ‌చ్చేసింది!

మెగా ప్రిన్స్ వ‌రుణ్ తేజ్ ప్ర‌స్తుతం బాక్సింగ్ నేప‌థ్యంలో ఓ మూవీ చేస్తున్న విష‌యం తెలిసిందే. ఈ మూవీ ద్వారా కిర‌ణ్ కొర్ర‌పాటి ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అవుతున్నారు. స్టార్ ప్రొడ్యూస‌ర్ అల్లు అరవింద్ స‌మ‌ర్ప‌ణ‌లో రీనైసెన్స్ పిక్చ‌ర్స్‌, అల్లు బాబీ కంప‌నీ బ్యాన‌ర్స్ పై సిద్దు ముద్ద‌, అల్లు బాబీ సంయుక్తంగా ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు.

ఈ చిత్రానికి `గ‌ని` అనే టైటిల్‌ని చిత్ర బృందం ఖ‌రారు చేసింది. హీర‌నో వ‌రుణ్ తేజ్ పుట్టిన రోజు నేడు. ఈ సంద‌ర్భంగా మేక‌ర్స్ టైటిల్‌తో పాటు ఫ‌స్ట్‌లుక్  మోష‌న్ పోస్ట‌ర్‌ని హీరో మెగా ప‌వ‌ర్‌స్టార్ రామ్‌చ‌ర‌ణ్‌ రిలీజ్ చేశారు. ఈ చిత్రం ద్వారా బాలీవుడ్ హీరోయిన్ స‌యీ మంజ్రేక‌ర్ హీరోయిన్‌గా టాలీవుడ్‌కి ప‌రిచ‌యం అవుతోంది. బాక్సింగ్ నేప‌థ్యంలో రూపొందుతున్న ఈ మూవీలో బాక్స‌ర్ గ‌ని పాత్ర‌లో వ‌రున్ తేజ్ క‌నిపించ‌బోతున్నారు.

గ‌త ప‌ది నెల‌లుగా లాక్‌డౌన్ కార‌ణంగా ఆగిపోయిన ఈ మూవీ రెగ్యుల‌ర్ షూటింగ్ ఇటీవ‌లే మొద‌లైంది. ఫ‌స్ట్ లుక్ మోష‌న్ పోస్ట‌ర్‌లో బాక్సింగ్ క్లౌజ్ ధ‌రించి బాక్సింగ్ బ్యాగ్‌పై పంచ్‌‌లు కురిపిస్తున్న వ‌రుణ్ తేజ్ లుక్ టెర్రిఫిక్‌గా వుంది. ఫ‌స్ట్ లుక్ మోష‌న్ టీజ‌ర్ సినిమాపై ఆస‌క్తిని రేకెత్తిస్తోంది. ఇందులో సునీల్‌శెట్టి, జ‌గ‌ప‌తిబాబు, న‌వీన్‌చంద్ర‌ కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. ఈ చిత్రానికి త‌మ‌న్ సంగీతం, అబ్బూరి ర‌వి  మాట‌లు, జార్జ్ సి విలియ‌మ్స్ ఫొటోగ్ర‌ఫీ ప్ర‌ధాన ఆక‌ర్ష‌ణ‌గా నిల‌వ‌నున్నాయి.