అల్రౌండర్ అనిపించుకుంటున్న వరుణ్


VarunTej
అల్రౌండర్ అనిపించుకుంటున్న వరుణ్

మెగా హీరోలలో వరుణ్ తేజ్ ది భిన్నమైన ప్రయాణం. తన మొదటి సినిమానే (ముకుంద) ఎలాంటి హడావిడి లేకుండా క్లాస్ సినిమా చేసాడు వరుణ్. రెండో సినిమా కంచెతోనే యుద్ధ నేపథ్యం ఉన్న వరల్డ్ వార్ 2 కి సంబంధించిన కథ చేసాడు. ఇక మూడు, నాలుగు యాక్షన్ సినిమాలు చేసినా, ఫిదా, తొలిప్రేమ చిత్రాలతో రొమాంటిక్ చిత్రాల ప్రేమికులను ఆకట్టుకున్నాడు. వెంటనే జోనర్ మార్చి అంతరిక్షం సినిమాతో స్పేస్ థ్రిల్లర్ చేసాడు. ఇక తన కెరీర్ లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ఎఫ్ 2 తో కామెడీ కూడా ట్రై చేసాడు. ఇప్పుడు వాల్మీకితో తొలిసారి మాస్ సినిమా చేస్తున్నాడు వరుణ్.

ఇలా కెరీర్ ను విభిన్నంగా మలుచుకుంటూ, అన్ని రకాల జోనర్స్ లో సినిమాలు చేస్తూ వరుణ్ అల్రౌండర్ అనిపించుకుంటున్నాడు. వాల్మీకి రేపు విడుదలవుతోంది. దీని తర్వాత వరుణ్ మళ్ళీ మాస్ సినిమా చేయకుండా బాక్సింగ్ నేపథ్యంలో స్పోర్ట్స్ డ్రామా చేస్తున్నాడు. జనవరి నుండి ఈ చిత్రం సెట్స్ కు వెళుతుంది. ఇలా సినిమా సినిమాకి జోనర్స్ మారుస్తూ తను ఒక ఇమేజ్ చట్రంలో ఇరుక్కుపోకుండా జాగ్రత్తపడుతున్నాడు వరుణ్.