స్పోర్ట్స్ డ్రామా మొదలుపెడుతున్న వరుణ్



స్పోర్ట్స్ డ్రామా మొదలుపెడుతున్న వరుణ్
స్పోర్ట్స్ డ్రామా మొదలుపెడుతున్న వరుణ్

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ సినిమా సినిమాకి వైవిధ్యం చూపిస్తూ నటుడిగా ఎదుగుతున్నాడు. వరస హిట్స్ కొడుతున్నాడు. రీసెంట్ గా గద్దలకొండ గణేష్ చిత్రంతో సూపర్ హిట్ అందుకున్న వరుణ్ ఇప్పుడు స్పోర్ట్స్ డ్రామా చేయనున్నాడు. ఈ చిత్రం బాక్సింగ్ ప్రధానంగా సాగుతుందని అర్ధమవుతోంది.

కిరణ్ అనే కొత్త దర్శకుడు ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నాడు. గీతా ఆర్ట్స్ సమర్పించనున్న ఈ చిత్రాన్ని అల్లు బాబీ నిర్మించనున్నాడు. ఈ నెల 10వ తారీఖున హైదరాబాద్ లో వరుణ్ కొత్త చిత్రం ప్రారంభమవుతుంది. ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో తెలుస్తాయి.

హిట్లు, ప్లాపులతో సంబంధం లేకుండా వరుణ్ తేజ్ తన కెరీర్ ను తెలివిగా మలుచుకుంటున్నాడు. తొలి ప్రేమ అంటూ లవ్ స్టోరీ, ఫిదాతో రొమాంటిక్ ఎంటర్టైనర్, ఎఫ్ 2 తో కామెడీ, అంతరిక్షంతో స్పేస్ జోనర్, గద్దలకొండ గణేష్ తో నెగటివ్ షేడ్స్.. ఇలా అన్ని జోనర్స్ టచ్ చేస్తూ నటుడిగా ఒక్కో మెట్టూ ఎదుగుతున్నాడు. మరి ఈ స్పోర్ట్స్ డ్రామా ద్వారా ఎలాంటి సినిమా అందించనున్నాడో వరుణ్.