ఆ సినిమా వాయిదా పడింది


మెగా బ్రదర్ నాగబాబు తనయుడు వరుణ్ తేజ్ హీరోగా నటించిన తొలిప్రేమ ఫిబ్రవరి 9న రిలీజ్ కావాల్సి ఉంది కాని సడెన్ గా ఆ సినిమా విడుదల వాయిదా వేశారు. అయితే వాయిదా అనగానే ఎన్ని రోజులో అనుకోవద్దు ఎందుకంటే ఒకరోజు తేడాతో ఫిబ్రవరి10న విడుదల చేయనున్నారు. ఈ ఒక్క రోజు కూడా వాయిదా ఎందుకంటే మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ నటించిన ఇంటలిజెంట్ ఫిబ్రవరి 9న విడుదల అవుతోంది దాంతో ఆ సినిమా కోసం ఒక్క రోజు వెసులుబాటు కల్పించారు. 
 
ఫిబ్రవరి 9న విడుదలైన తర్వాత కొద్దిసేపట్లోనే ఇంటలిజెంట్ రిజల్ట్ ఏంటో తెలిసిపోనుంది. దాంతో తొలిప్రేమ మీద ఒక అంచనాకు రానున్నారు. అయినా ఇంటలిజెంట్ యాక్షన్ ఎన్టీఆర్ టైనర్ కాగా వరుణ్ తేజ్ తొలిప్రేమ పూర్తిగా ప్రేమకథా చిత్రం కాబట్టి రెండు జానర్ లు వేరు వేరు కాబట్టి ఎవరి సినిమా మీద వాళ్ళు నమ్మకంగానే ఉన్నారు. ఇద్దరు మెగా హీరోలు రెండు రోజులలో వస్తున్నారు మరి ఈ ఇద్దరిలో ఎవరు హిట్ కొడతారో చూడాలి.