బాల‌య్య హీరోయిన్ ర‌చ్చ రంబోలా డ్యాన్స్‌!


బాల‌య్య హీరోయిన్ ర‌చ్చ రంబోలా డ్యాన్స్‌!
బాల‌య్య హీరోయిన్ ర‌చ్చ రంబోలా డ్యాన్స్‌!

లాక్‌డౌన్ కార‌ణంగా సెల‌బ్రిటీలు చిత్ర విచిత్రాలు చేస్తున్నారు. ఇన్ స్టా వేదిక‌గా చిత్ర విచిత్ర‌మైన ఫీట్‌లు చేస్తూ వీడియోలు పోస్ట్ చేస్తున్నారు. హీరోల కంటే ఎక్కువ‌గా హీరోయిన్‌, క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్‌లు, ఐట‌మ్ గ‌ళ్స్ ఇన్‌స్టాలో వీడియోల‌తో, ఫొటోల‌తో హంగామా చేస్తున్నారు. ఈ జాబితాలో బాల‌య్య హీరోయిన్ వేదిక కూడా చేరిపోయింది.

ముని, బాణం చిత్రాల‌తో తెలుగు ప్రేక్ష‌కుల ముందుకొచ్చినా పెద్ద‌గా అవ‌కాశాల్ని సొంతం చేసుకోలేక‌పోయింది. తాజాగా `కాంచ‌న 3`తో సూప‌ర్ హిట్‌ని సొంతం చేసుకుంది. అదే ఊపులో బాల‌య్య‌తో క‌లిసి `రూల‌ర్‌` చిత్రంలో మెరిసింది వేదిక‌. ఇక‌పై టాలీవుడ్‌, కోలీవుడ్‌లో క్రేజీ ఆఫ‌ర్ల‌ని ద‌క్కించుకోవాల‌ని నిత్యం సోష‌ల్ మీడియా ద్వారా అభిమానుల‌కు అందుబాటులో వుంటోంది.

ప‌నిలో ప‌నిగా హాట్ ఫొటోలు, వీడియోల‌తో హ‌ల్‌చ‌ల్ చేస్తోంది. తాజాగా  ర‌చ్చ రంబోలా డ్యాన్స్ చేస్తూ స్క‌ర్ట్‌లో హంగామా చేసింది. ఓ పాప్ బీట్‌కు మెలిక‌లు తిరిగిపోతూ వేదిక చేసిన డ్యాన్స్ హంగామా సోష‌ల్ మీడియాలో ర‌చ్చ చేస్తోంది. దీనికి సంబంధించిన ఓవీడియో ప్ర‌స్తుతం వైర‌ల్‌గా మారింది.

 

View this post on Instagram

 

#CornyRema #Dance #ParrisGoebel #ParrisLive #StayHome #India #Corny Haircut 💇‍♀️ by my love #Mom #Dancing

A post shared by Vedhika (@vedhika4u) on

Credit: Instagram