వాల్మీకిలో ఈ పాటే స్పెషల్ అట్రాక్షన్ అవుతుందిట


మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం వాల్మీకి. ఇందులో వరుణ్ తేజ్ గడ్డలకొండ గణేష్ అని నెగటివ్ షేడ్స్ అధికంగా ఉండే పాత్రలో కనిపించనున్న విషయం తెల్సిందే. ఒకవైపు ఈ సినిమా టైటిల్ కు సంబంధించిన వివాదం నడుస్తుండగానే చిత్ర యూనిట్ మాత్రం సినిమా విడుదలకు ఏర్పాట్లు చేసుకుంటోంది. నిన్న ఈ చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా జరిగింది. అవ్వడానికి ఇది తమిళ చిత్రం జిగర్తాండకు రీమేక్ అయినా హరీష్ శంకర్ తనదైన శైలిలో ఇందులో మార్పులు చేసాడు. ఒరిజినల్ లో లేని వరుణ్ పాత్రకు ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ ఒకటి సెట్ చేసాడు. ఇది పూర్తి ఎంటర్టైనింగ్ గా ఉండేలా జాగ్రత్తలు తీసుకున్నాడు. ఈ చిత్రంలో వరుణ్, పూజ మధ్య “వెల్లువొచ్చి గోదారమ్మ” పాట రీమిక్స్ కూడా చేసారు. ఈ పాటకు సంబంధించిన మేకింగ్ వీడియో కూడా విడుదల చేసారు.

ఒరిజినల్ సాంగ్ తరహాలోనే గోదావరి అందాల మధ్య బిందెల సెటప్ తో హీరో, హీరోయిన్లు అలాంటి డ్రెస్సులు, అవే స్టెప్పులతో ఒరిజినల్ ను రిక్రియెట్ చేసే ప్రయత్నం చేసారు. ఈ సాంగ్ సిట్యుయేషన్, చిత్రీకరణ కూడా హైలైట్ గా ఉండనుందని తెలుస్తోంది. సెప్టెంబర్ 20న ఈ చిత్రం విడుదల కానుంది.