విక్ట‌రీ వెంక‌టేష్‌, వ‌రుణ్‌ల `ఎఫ్‌3` మొద‌లైంది!

విక్ట‌రీ వెంక‌టేష్‌, వ‌రుణ్‌ల `ఎఫ్‌3` మొద‌లైంది!
విక్ట‌రీ వెంక‌టేష్‌, వ‌రుణ్‌ల `ఎఫ్‌3` మొద‌లైంది!

గ‌త ఏడాది సంక్రాంతికి విడుద‌లైన చిత్రం `ఎఫ్‌2`. ఫ‌న్ అండ్ ఫ్ర‌స్ట్రేష‌న్ తో ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్‌గా అన్ని వ‌ర్గాల ప్రేక్ష‌కుల్ని ఆక‌ట్టుకుని భారీ విజ‌యాన్ని సొంతం చేసుకుంది. విక్ట‌రీ వెంక‌టేష్‌, వ‌రుణ్ తేజ్ హీరోలుగా అనిల్ రావిపూడి ద‌ర్శ‌క‌త్వంలో దిల్ రాజు నిర్మించిన ఈ చిత్రం వంద కోట్లు వ‌సూళ్ల‌ని రాబ‌ట్టింది. ఈ మూవీకి సీక్వెల్‌గా రూపొందుతున్న చిత్రం `ఎఫ్ 3`. అనిల్ రావిపూడి ద‌ర్శ‌క‌త్వంలో దిల్ రాజు నిర్మిస్తున్న ఈ మూవీ గురువారం లాంఛ‌నంగా మొద‌లైంది.

విక్టరీ వెంక‌టేష్‌, వ‌రుణ్‌తేజ్ హీరోలుగా న‌టిస్తున్నారు. త‌మ‌న్నా , మెహ‌రీన్ హీరోయ‌న్‌లు. వ‌రుణ్‌తేజ్‌, త‌మ‌న్నాల‌పై పూజా కార్య‌క్ర‌మాల అనంత‌రం చిత్రీక‌రించిన ముహూర్త‌పు స‌న్నివేశానికి ప్ర‌ముఖ నిర్మాత అల్లు అర‌వింద్ క్లాప్ నిచ్చారు. సంస్థ కార్యాల‌యంలో జ‌రిగిన ఈ కార్య‌కక్ర‌మంలో నిర్మాత‌లు దిల్‌రాజు, శిరీష్‌, అనిల్ రావిపూడి, హ‌ర్షిత్‌రెడ్డి తదిత‌రులు పాల్గొన్నారు.

దేవిశ్రీ‌ప్ర‌సాద్ సంగీతం అందిస్తున్న ఈ మూవీ రెగ్యుల‌ర్ షూటింగ్ హైద‌రాబాద్‌లో ఈ నెల 23 నుంచి ప్రారంభం కానుంది. `ఎఫ్ 2` లో ఫ‌న్ అండ్ ఫ్ర‌స్ట్రేష‌న్‌ని మాత్ర‌మే ప్ర‌ధానంగా చూపించిన అనిల్ రావిపూడి `ఎఫ్‌3`లో మాత్రం ఈ రెండింటికి తోడు మ‌నీ ద్వారా వ‌చ్చే ఫ్ర‌స్ట్రేష‌న్‌ని, ఫ‌న్‌ని చూపించ‌బోతున్నార‌ట‌. ఇటీవ‌లే ఈ మూవీకి సంబంధించిన ఫ‌స్ట్ లుక్ కాన్సెప్ట్ పోస్ట‌ర్‌ని రిలీజ్ చేసిన విష‌యం తెలిసిందే.