మహేష్ కోసం వస్తున్న వెంకటేష్ , విజయ్ దేవరకొండ


మహేష్ కోసం వస్తున్న వెంకటేష్ , విజయ్ దేవరకొండ
Maharshi Poster

మరికొద్ది సేపట్లో హైదరాబాద్ లోని పీపుల్స్ ప్లాజా లో మహర్షి చిత్ర ప్రీ రిలీజ్ వేడుక అంగరంగ వైభవంగా జరుగనుంది . కాగా ఈ వేడుకకు పెద్దోడు వెంకటేష్ తో పాటుగా రౌడీ అలియాస్ అర్జున్ రెడ్డి అలియాస్ విజయ్ దేవరకొండ గెస్ట్ లుగా హాజరు కానున్నారు . యూత్ లో విజయ్ దేవరకొండ కు విపరీతమిన క్రేజ్ ఉన్న విషయం తెలిసిందే . దాంతో ఈరోజు జరిగే మహర్షి వేడుకలో రచ్చ రచ్చ జరగడం ఖాయంగా కనిపిస్తోంది .

వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కిన మహర్షి చిత్రాన్ని మే 9 న భారీ ఎత్తున విడుదల చేయనున్నారు . దాంతో కార్మికుల దినోత్సవమైన మేడే రోజున మహర్షి ప్రీ రిలీజ్ వేడుకని పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నారు . మహేష్ బాబు సరసన పూజా హెగ్డే నటించగా దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించాడు . సీనియర్ హీరో వెంకటేష్ కు అశ్వనిదత్ తో పాటుగా దిల్ రాజు , మహేష్ బాబు లతో మంచి అనుబంధం ఉండటం వల్ల వస్తున్నాడు . వెంకటేష్ – మహేష్ బాబు ల కాంబినేషన్ లో సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు చిత్రం వచ్చిన విషయం తెలిసిందే .