విజయ్ దేవరకొండ రికార్డ్ ని బద్దలు కొట్టిన వెంకీ


Venkatesh beats Vijay devarakonda record

సీనియర్ హీరో వెంకటేష్ క్రేజీ హీరో విజయ్ దేవరకొండ రికార్డ్ ని బద్దలు కొట్టాడు . విజయ్ దేవరకొండ రికార్డ్ ని వెంకటేష్ బద్దలు కొట్టడం ఏంటి ? అని అనుకుంటున్నారా ? ఈ సీనియర్ హీరో నటించిన ఎఫ్ 2 చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదలైన విషయం తెలిసిందే . కాగా ఆ చిత్రం 16 రోజుల్లోనే 71 కోట్లకు పైగా షేర్ సాధించింది . దాంతో విజయ్ దేవరకొండ పేరిట ఉన్న గీత గోవిందం 70 కోట్ల షేర్ రికార్డ్ బద్దలైంది .

విజయ్ దేవరకొండ నటించిన గీత గోవిందం చిన్న చిత్రంగా రిలీజ్ అయి సంచలన విజయం సాధించింది . మొత్తం లాంగ్ రన్ లో 70 కోట్లకు పైగా షేర్ వసూల్ చేసింది గీత గోవిందం చిత్రం . అయితే వెంకటేష్ – తమన్నా , వరుణ్ తేజ్ మెహరీన్ జంటగా నటించిన ఎఫ్ 2 ఇప్పటికే 71 కోట్లకు పైగా షేర్ సాధించింది .  కలెక్షన్లు ఇంకా బాగానే వస్తున్నాయి కాబట్టి అవలీలగా 80 కోట్లు దాటుతుందని భావిస్తున్నారు ట్రేడ్ విశ్లేషకులు .

English Title: Venkatesh beats Vijay devarakonda record