ఆ సినిమా రిలీజ్ అయి సరిగ్గా 33 ఏళ్ళు


venkatesh compleeted 33 years in fim industry
venkatesh compleeted 33 years in fim industry

విక్టరీ వెంకటేష్ నటించిన కలియుగ పాండవులు విడుదలై సరిగ్గా 33 ఏళ్ళు అవుతోంది . తన బాబాయ్ నటించిన సంచలన విజయం సాధించిన  కలియుగ పాండవులు చిత్రం తాలూకు ఫోటో సోషల్ మీడియాలో పెట్టేసి అప్పటి విషయాన్నీ గుర్తు చేస్తున్నాడు రానా . 1986 ఆగస్టు 14 న విడుదలై ఘనవిజయం సాధించింది కలియుగ పాండవులు .

33 ఏళ్ల క్రితం యాదృచ్చికంగా హీరో అయ్యాడు , అయితే మొదటి సినిమానే సూపర్ హిట్ కావడంతో బిజినెస్ మెన్ అయిదామనుకున్న వెంకీ స్టార్ హీరో అయిపోయాడు . కే . రాఘవేంద్రరావు దర్శకత్వంలో తెరెకెక్కిన కలియుగ పాండవులు చిత్రాన్ని వెంకటేష్ తండ్రి డాక్టర్ డి. రామానాయుడు నిర్మించిన సంగతి తెలిసిందే . నటుడిగా వెంకటేష్ 33 ఏళ్ళు పూర్తిచేసుకున్నాడు . ప్రస్తుతం వెంకీ మామ అనే చిత్రంలో నటిస్తున్నాడు వెంకటేష్ .

Credit: Instagram