బాలీవుడ్ సూపర్ హిట్ రీమేక్ లో వెంకీ !


సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్ బాలీవుడ్ సూపర్ హిట్ చిత్రం దే దే ప్యార్ దే చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేయనున్నట్లు తెలుస్తోంది . అజయ్ దేవ్ గన్ , టబు , రకుల్ ప్రీత్ సింగ్ నటించిన దే దే ప్యార్ దే చిత్రం బాలీవుడ్ లో మంచి హిట్ అయ్యింది . అంతేకాకుండా వెంకటేష్ ఏజ్ కు తగిన కథ కావడంతో ఈ చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేయాలనే ఆలోచన చేస్తున్నారు వెంకటేష్ అన్నయ్య నిర్మాత దగ్గుబాటి సురేష్ బాబు .

ప్రస్తుతం చర్చలు జరుగుతున్నాయి , రీమేక్ కు సంబంధించి లెక్కలు తేలితే ……. రీజనబుల్ రేట్ లో ఆ సినిమా హక్కులు వస్తే రీమేక్ చేయడానికి సిద్ధం అవుతున్నారు . అజయ్ దేవ్ గన్ పాత్రలో వెంకటేష్ నటించడానికి ఉత్సాహం చూపిస్తున్నాడట దాంతో ప్రస్తుతం చర్చలు సాగుతున్నాయి . అవి కొలిక్కి వస్తాయా ? లేదా చూడాలి . ఇక వెంకటేష్ ప్రస్తుతం తన మేనల్లుడు అక్కినేని నాగచైతన్య తో కలిసి వెంకీ మామ అనే చిత్రంలో నటిస్తున్నాడు .