ఆసుపత్రిలో వెంకటేష్


Venkatesh in hospital
Daggubati Venkatesh

సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్ ఆసుపత్రిలో జాయిన్ అయ్యాడు , అవును విశాఖపట్టణం లోని నేచురల్ క్యూర్ ఆసుపత్రిలో వెన్ను నొప్పికి చికిత్స తీసుకుంటున్నాడు . ఇటీవలే ఎఫ్ 2 తో సంచలన విజయం అందుకున్నాడు వెంకటేష్ . 59 సంవత్సరాల వెంకటేష్ వెన్ను నొప్పితో బాధపడుతున్నాడు దాంతో ఆ చికిత్స కొసం వైజాగ్ వెళ్ళాడు . అక్కడే ట్రీట్ మెంట్ తీసుకొని అది నయం అయ్యాక హైదరాబాద్ తిరిగి రానున్నాడు .

విశాఖపట్టణం లో కూడా రామానాయుడు స్టూడియో ఉన్న విషయం తెలిసిందే . హైదరాబాద్ తో పాటుగా విశాఖపట్టణం లో కూడా రామానాయుడు స్టూడియో ని కట్టాడు . అయితే ఆమధ్య వచ్చిన హుదుద్ తుఫాన్ వల్ల కొంత నష్టం జరిగినప్పటికీ మళ్ళీ పునర్నిర్మించారు . ఎఫ్ 2 తో గ్రాండ్ సక్సెస్ కొట్టిన వెంకీ మరిన్ని సినిమాల కోసం రెడీ అవుతున్నాడు .

English Title: Venkatesh in hospital