‘వెంకీ మామ’లో అదరకొడుతున్న మామ అల్లుళ్ళుvenkatesh nagachaitanya in venky mama
venkatesh nagachaitanya in venky mama

విక్టరీ వెంకటేష్, యువ సామ్రాట్ నాగచైతన్య కాంబినేషన్లో బాబీ దర్శకుడిగా సురేష్ ప్రొడక్షన్స్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్స్ పై సురేష్ బాబు, టి జి. విశ్వప్రసాద్ సంయుక్తంగా నిర్మిస్తోన్న ఫ్యామిలీ ఎంటర్టైనర్ చిత్రం వెంకీమామ. రాశి ఖన్నా, పాయల్ రాజ్ పుత్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు.

నాగచైతన్య నటించిన ప్రేమమ్ చిత్రం చిత్రం లో వెంకటేష్ గెస్ట్ అప్పీరియన్స్ పాత్రలో తళుక్కున మేరీ అభిమానుల్ని అలరించారు. ఇప్పుడు ఫుల్ లెంగ్త్ క్యారెక్టర్ లో ఇద్దరు కలిసి నటించడం ఫాన్స్ కి పెద్ద పండగనే చెప్పాలి.

ఇక వెంకీ మామ చిత్రం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. ఈ చిత్రం మొదటి లుక్ పోస్టర్ ని వినాయకి చవితి కానుకగా రిలీజ్ చేసింది చిత్ర యూనిట్. ఈ పోస్టర్లో మామ అల్లుళ్ళు ఇద్దరు యెర్ర చొక్కా తెల్ల పంచె ధరించి ఒకరినొకరు భుజాలపై చేతులు వేసుకుంటూ అలా షికారుకు వెళ్తున్నట్టు పోజిచ్చారు.

ఈ కాంబినేషన్ కోసం అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఎఫ్-2తో ప్రేక్షకులను అలరించిన వెంకటేష్ మరి ఈ చిత్రంలో కూడా తనదైన పంచ్ డైలాగ్స్ తో అలరించనున్నారని చిత్ర యూనిట్ లో టాక్ వినిపిస్తోంది. తమన్ సంగీతాన్ని అందిస్తున్న వెంకీ మామ చిత్రం మ్యూజికల్ హిట్ కానుందని ఫిలిం నగర్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి..!!