వెంకీ ఖాతాలో మ‌రో మెస్మ‌రైజింగ్ క్యారెక్ట‌ర్‌‌!

Venkatesh palying surpricing charecter in f3
Venkatesh palying surpricing charecter in f3

క్యారెక్ట‌ర్ కోసం ఇమేజ్‌ని ప‌క్క‌న పెట్టి ఎంట‌ర్‌టైన్ చేయ‌డం హీరో వెంక‌టేష్ త‌రువాతే ఎవ‌రైనా. గ‌త కొంత కాలంగా త‌ర మార్కు ఎంట‌ర్‌టైన్‌మెంట్‌కు దూరంగా వుంటూ వ‌స్తున్న ఆయ‌న `ఎఫ్‌2`తో త‌న‌దైన స్టైల్ వినోదాన్ని ప‌డించి వెంకీ త‌న మార్కు ఆస‌న్‌తో ఎంట‌ర్‌టైన్ చేసిన విష‌యం తెలిసిందే. ప్ర‌స్తుతం ఈ మూవీకి కొన‌సాగింపుగా రూపొందుతున్న చిత్రం `ఎఫ్‌3`. అనిల్ రావిపూడి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు.

`ఎఫ్‌2`లో వెంకీ ఆస‌న్‌తో హిలేరియ‌స్ కామెడీని పండించిన విక్ట‌రీ వెంక‌టేష్ `ఎఫ్‌3`లోనూ అంత‌కు మించిన వినోదాన్ని అందించ‌బోతున్నార‌ట‌. డ‌బ్బు చుట్టూ తిరిగే ఈ చిత్రంలో విక్ట‌రీ వెంక‌టేష్ రేచీక‌టి ప్రాబ్ల‌మ్ వున్న వ్య‌క్తిగా క‌నిపించ‌బోతున్నా‌ర‌ట‌. దీంతో ఈ మూవీలో మ‌రింత ఎంట‌ర్‌టైన్‌మెంట్ గ్యారెంటీ అంటున్నారు. వెంకీతో క‌లిసి ఈ చిత్రంలో వ‌రుణ్‌తేజ్‌,తమ‌న్నా, మెహ‌రీన్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టిస్తున్నార‌కు.

ఇటీవ‌లే ఈ మూవీ రెగ్యుల‌ర్ షూటింగ్ మొద‌లైంది. రెండ‌వ‌ షెడ్యూల్ పూర్తియింది. దిల్‌రాజు , శిరీష్ నిర్మిస్తున్న ఈ మూవీని డ‌బ్బు వ‌ల్ల వ‌చ్చే ఫ్ర‌స్ట్రేష‌న్ నేప‌థ్యంలో రూపొందిస్తున్నారు. దేవిశ్రీ‌ప్ర‌సాద్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని ఆగ‌స్టు 27న ప్ర‌పంచ వ్యాప్తంగా విడుద‌ల చేస్తున్న‌ట్టు చిత్ర బృందం ఇప్ప‌టికే ప్ర‌క‌టించింది.