వెంకీ తరుణ్ భాస్కర్ సినిమా కన్ఫర్మ్ అయినట్టేనా?


వెంకీ తరుణ్ భాస్కర్ సినిమా కన్ఫర్మ్ అయినట్టేనా?
వెంకీ తరుణ్ భాస్కర్ సినిమా కన్ఫర్మ్ అయినట్టేనా?

విక్టరీ వెంకటేష్ ప్రస్తుతం చేస్తోన్న సినిమా వెంకీ మామ. ఇందులో నాగ చైతన్య మరో హీరోగా చేస్తోన్న విషయం తెల్సిందే. ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ పోర్షన్ ఇప్పటికే పూర్తయింది. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు కూడా పూర్తి చేసి త్వరలోనే చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు వార్తలు వస్తున్నాయి.

దీని తర్వాత వెంకటేష్ త్రినాధరావు నక్కిన దర్శకత్వంలో ఒక చిత్రం చేయనున్నాడని అన్నారు. కానీ ఇప్పుడు అవి వట్టి పుకార్లేనని తెలుస్తోంది. వెంకటేష్ – తరుణ్ భాస్కర్ తో ఒక చిత్రం చేయనున్నాడట. పెళ్లి చూపులు, ఈ నగరానికి ఏమైంది చిత్రాల దర్శకత్వం తర్వాత తరుణ్ భాస్కర్ దృష్టి ఎందుకనో నటన వైపు మళ్లింది. ఫలక్ నుమా దాస్ సినిమాలో ఒక పాత్ర చేసిన తరుణ్ భాస్కర్ ఇప్పుడు మీకు మాత్రమే చెప్తా అనే చిత్రంలో హీరోగా నటిస్తున్నాడు.

ఈ చిత్రం పూర్తవ్వగానే వెంకీ సినిమా స్క్రిప్ట్ పూర్తి చేయనున్నాడట. డిసెంబర్ లో వెంకీ పుట్టినరోజు నాడు ఈ చిత్రం అనౌన్స్ చేసి అదే నెలలో షూటింగ్ కి వెళ్లేలా ప్లాన్ చేస్తున్నారట. ఇదొక స్పోర్ట్స్ డ్రామా అని తెల్సింది. హార్స్ రేసింగ్ నేపథ్యంలో సినిమా ఉంటుందని, వెంకీ హార్స్ రేసర్లుకు ట్రైనింగ్ ఇచ్చే కోచ్ పాత్రలో కనిపిస్తాడని అంటున్నారు. వీటిలో నిజమెంతో తెలియాలంటే మరికొద్ది రోజులు ఎదురుచూడాలి.