వెబ్ సిరీస్ లపై క్లారిటీ ఇచ్చేసిన వెంకీ


వెబ్ సిరీస్ లపై క్లారిటీ ఇచ్చేసిన వెంకీ
వెబ్ సిరీస్ లపై క్లారిటీ ఇచ్చేసిన వెంకీ

విక్టరీ వెంకటేష్ ప్రధాన పాత్రలో నటించిన వెంకీ మామ ఈరోజే విడుదలై కొంత డివైడ్ టాక్ తెచ్చుకుంది. అక్కినేని నాగ చైతన్య కూడా ఈ సినిమాలో నటించినా ఫోకస్ మొత్తం వెంకీ మీదే ఉండడం గమనార్హం. వెంకీ మామ చిత్రాన్ని సేఫ్ జోన్ కు తీసుకురావాలన్నా కూడా అది వెంకీ మామ వల్లనే అవుతుందని వ్యాఖ్యానాలు వినిపిస్తున్నాయి. ఇదిలా ఉంటే వెంకీ మామ కోసం వెంకటేష్ ప్రమోషన్స్ ను ఓ రేంజ్ లో చేస్తున్నాడు. రానాతో ఇటీవలే ఒక ఇంటర్వ్యూ ఇచ్చిన వెంకటేష్, విడిగా వేరే మీద సంస్థలకు కూడా విరివిగా ఇంటర్వ్యూలు ఇస్తున్నాడు. ఈ సందర్భంలో వివిధ ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చాడు వెంకీ.

సినిమాకు సంబంధించిన విశేషాలు చెబుతూనే వివిధ అంశాలపై కూడా స్పందించాడు. ఇటీవలే కాలంలో దూసుకొచ్చిన ట్రెండ్ వెబ్ సిరీస్ పై కూడా తన అభిప్రాయాన్ని చెప్పాడు. నిజానికి వెబ్ సిరీస్ లపై నేటి యువత మోజు నానాటికీ పెరుగుతోంది. డేటా చార్జీలు అందుబాటు ధరలలో ఉండడంతో డేటా వాడే వారి సంఖ్య రోజురోజుకీ పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో వివిధ ఓటిటి ప్లాట్ ఫామ్స్ వెబ్ సిరీస్ లను అందిస్తున్నాయి.

అయితే వెబ్ సిరీస్ లకు ఆదరణ ఎలా ఉన్నా ఇంకా సినిమా వాళ్ళు మాత్రం దాన్ని తక్కువ కిందే చూస్తున్నారు. సినిమా కంటే వెబ్ సిరీస్ ల స్థాయి చిన్నది అన్నది చాలా మంది భావన. క్వాలిటీ పరంగా మేకింగ్ పరంగా ఎక్కడా రాజీ పడకుండా వెబ్ సిరీస్ లు తెరకెక్కుతున్నాయి. ఇప్పుడిప్పుడే స్టార్స్ కూడా వెబ్ సిరీస్ లవైపు అడుగులు వేస్తున్నారు. ఇప్పటికే కాజల్, తమన్నా, తాప్సి వంటి వారు వెబ్ సిరీస్ లలో నటిస్తున్నారు. హీరోలు ఇంకా అటువైపు చూడట్లేదు. సందీప్ కిషన్ ఒక్కడే ఫ్యామిలీ మ్యాన్ లో నటించాడు.

ఈ నేపథ్యంలో వెబ్ సిరీస్ ల గురించి మాట్లాడుతూ అవకాశం ఉంటే తప్పకుండా వాటిలో నటించడానికి సిద్ధంగా ఉన్నానని, అవకాశం వచ్చే వరకూ ఎదురుచూడడం దేనికి, మనమే అవకాశాలు అడగొచ్చు కదా అంటూ ఫిల్మ్ మేకర్స్ ను తానే సంప్రదిస్తానని తెలిపాడు. వెంకటేష్ అంటే డౌన్ టు ఎర్త్ అనే భావన అందరిలోనూ ఉంది. తాజాగా వెబ్ సిరీస్ లపై స్పందన చూసి వెంకీ భలే మాట్లాడాడు కదా అనుకుంటున్నారు.