వెంకటేష్, తరుణ్ భాస్కర్ చిత్రానికి మొత్తానికి క్లియరెన్స్ వచ్చింది

వెంకటేష్, తరుణ్ భాస్కర్ చిత్రానికి మొత్తానికి క్లియరెన్స్ వచ్చింది
వెంకటేష్, తరుణ్ భాస్కర్ చిత్రానికి మొత్తానికి క్లియరెన్స్ వచ్చింది

విక్టరీ వెంకటేష్ రీసెంట్ గా నారప్ప చిత్ర షూటింగ్ ను పూర్తి చేసాడు. ప్రస్తుతం తన ఫోకస్ అంతా ఎఫ్3 పైనే ఉంది. అనిల్ రావిపూడి దర్శకత్వంలో వరుణ్ తేజ్ మరో హీరోగా తెరకెక్కుతున్న ఈ చిత్ర షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా సాగుతోంది. ఆగస్ట్ 27న ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు. జులై కల్లా చిత్ర షూటింగ్ ను పూర్తి చేయాలన్నది ప్లాన్ గా పెట్టుకున్నారు.

తాజా సమాచారం ప్రకారం ఎఫ్3 తర్వాత వెంకటేష్ చేయబోయే చిత్రానికి సంబంధించిన క్లారిటీ వచ్చింది. దాదాపు రెండేళ్ల క్రితం దర్శకుడు తరుణ్ భాస్కర్ వెంకటేష్ తో సినిమాను అనౌన్స్ చేసాడు. హార్స్ రేసింగ్ నేపథ్యంలో సినిమా ఉంటుందని తెలిసింది. అయితే వివిధ కారణాల వల్ల ఈ సినిమా పట్టాలెక్కలేదు.

తాజా సమాచారం ప్రకారం తరుణ్ భాస్కర్ ఈ సినిమా స్క్రిప్ట్ పై పూర్తిగా వర్కౌట్ చేసాడట. హార్స్ రేసింగ్ నేపధ్యం నుండి క్రైమ్ డ్రామాగా స్క్రిప్ట్ ను మార్చి మొత్తానికి దగ్గుబాటి క్యాంపును ఇంప్రెస్ చేసినట్లు తెలుస్తోంది. ఆగస్ట్ నుండి ఈ సినిమా పట్టాలెక్కే అవకాశాలు ఉన్నాయి. సురేష్ ప్రొడక్షన్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుంది.