`దృశ్యం 2 ` టీమ్‌కు వెంకీ మామ బైబై!

 

Venkatesh wraps his portion of the shoot for drishyam 2
Venkatesh wraps his portion of the shoot for drishyam 2

విక్ట‌రీ వెంక‌టేష్ `దృశ్యం 2` మూవీ టీమ్‌కి  బై బై చెప్పేశారు. ఆయ‌న ప్ర‌ధాన పాత్ర‌లో న‌టిస్తున్న చిత్రం `దృశ్యం 2`. జీతు సోసెఫ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. డి. సురేష్‌బాబు, ఆంటోని పెరుంబువార్‌, రాజ్ కుమార్ సేతుప‌తి సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మ‌ల‌యాళంలో మోహ‌న్‌లాల్ మీనా నంటించిన ఈ చిత్రాన్ని తెలుగులో వెంక‌టేష్ హీరోగా తెర‌కెక్కిస్తున్నారు.

మీనా ప్ర‌ధాన పాత్ర‌లో వెంక‌టేష్‌కు జోడీగా న‌టిస్తోంది. న‌దియా, న‌రేష్ కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్న ఈ మూవీ చిత్రీక‌ర‌ణ శ‌ర‌వేగంగా జ‌రుగుతోంది. తాజాగా విక్ట‌రీ వెంక‌టేష్‌కు సంబంధించిన షూటింగ్ పూర్త‌యింది. దీంతో వెంక‌టేష్ చిత్ర బీందానికి బై బై చెప్పేశారు. గురువారంతో వెంక‌టేష్‌కు సంబంధించిన పోర్ష‌న్ పూర్త‌యింది. ఈ విష‌యాన్ని తెలియ‌జేస్తూ ద‌ర్శ‌కుడు, ఇత‌ర న‌టీన‌టుల‌తో క‌లిసి లొకేష‌న్‌లో దిగిన ఫొటోని చిత్ర నిర్మాణ సంస్థ సురేష్ ప్రొడ‌క్ష‌న్స్ సోష‌ల్ మీడియా వేదిక‌గా అభిమానుల‌తో షేర్ చేసుకుంది.

గ‌తంలో వెంక‌టేష్ న‌టించిన `దృశ్యం` చిత్రానికి సీక్వెల్‌గా ఈ మూవీని తెలుగులో రీమేక్ చేస్తున్నారు. అంతే కాకుండా ఇటీవ‌ల మ‌ల‌యాళంలో మోహ‌న్‌లాల్ న‌టించిన `దృశ్యం2` చిత్రానికి అఫీషియ‌ల్ రీమేక్ గా ఈ మూవీని రూపొందిస్తున్నారు. మాతృక‌ను డైరెక్ట్ చేసిన జీతు జోసెఫ్ తెలుగు రీమేక్‌ని డైరెక్ట్ చేస్తున్నారు. ఫ్యామిలీ ఎమోష‌న్స్ నేప‌థ్యంలో సాగే స‌స్పెన్స్ నేప‌థ్యంలో ఈ చిత్రం త్వ‌ర‌లోనే ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.