50 కోట్ల దిశగా దూసుకుపోతోంది


Venkatesh's F2 towards 50 crores club
Venkatesh and Varun Tej

సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్ , వరుణ్ తేజ్ లు నటించిన ఎఫ్ 2 చిత్రం యాభై కోట్ల షేర్ దిశగా దూసుకుపోతోంది . జనవరి 12న విడుదలైన ఈ చిత్రానికి ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు . దాంతో వసూళ్ల వర్షం కురుస్తోంది . వెంకటేష్ కెరీర్ లో భారీ హిట్ లున్నాయి అయితే అప్పట్లో ఇన్ని కోట్లు వసూల్ చేసిన చిత్రాలు లేవు , అప్పటి లెక్కలు అప్పటివే అయినప్పటికీ ఈరోజుల్లో కూడా 50 కోట్ల క్లబ్ లో చేరిన హీరోలు ఉన్నారా అంటే ….. సీనియర్ హీరోలైన చిరంజీవి , బాలకృష్ణ , నాగార్జున 50 కోట్ల క్లబ్ లో చేరారు కానీ వెంకటేష్ మాత్రం ఆ స్థాయి వసూళ్లు సాధించలేదు .

కానీ ఆ ఛాన్స్ ఇప్పుడు ఎఫ్ 2 రూపంలో వచ్చింది . ఇంకా వారం రోజులు పూర్తికాకుండానే 32 కోట్ల షేర్ రాబట్టింది ఎఫ్ 2 . ఇప్పుడు బాక్సాఫీస్ వద్ద సరైన సినిమా కూడా ఏది పోటీలో లేదు ఎఫ్ 2 కి దాంతో అవలీలగా 50 కోట్ల షేర్ ని సాధించడం ఖాయమని అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు . అనిల్ రావిపూడి దర్శకత్వంలో దిల్ రాజు నిర్మించిన ఈ చిత్రంలో తమన్నా , మెహరీన్ లు హీరోయిన్ లుగా నటించారు . ఎఫ్ 2 ఈ ఏడాది సంక్రాంతి రారాజుగా నిలిచింది .

English Title: Venkatesh’s F2 towards 50 crores club