140 కోట్లు వసూల్ చేసిన ఎఫ్ 2


Venkatesh's F2 world wide collections

విక్టరీ వెంకటేష్ , వరుణ్ తేజ్ లు హీరోలుగా నటించిన ఎఫ్ 2 చిత్రం 140 కోట్ల గ్రాస్ వసూళ్లని సాధించింది . జనవరి 12న రిలీజ్ అయిన ఎఫ్ 2 భారీ ఓపెనింగ్స్ సాధించడమే కాకుండా ఈ ఏడాది తొలి బ్లాక్ బస్టర్ గా నిలిచింది . వెంకటేష్ కెరీర్ లోనే అత్యధిక వసూళ్ల ని సాధించిన చిత్రంగా నిలిచింది ఎఫ్ 2 . 140 కోట్ల గ్రాస్ వసూళ్లు 80 కోట్ల షేర్ సాధించి ట్రేడ్ విశ్లేషకులను సైతం ఆశ్చర్యానికి గురిచేసింది .

 

వెంకటేష్ సరసన తమన్నా నటించగా వరుణ్ తేజ్ సరసన మెహరీన్ నటించింది . ఇక ఈ చిత్రానికి అనిల్ రావిపూడి దర్శకత్వం వహించగా దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మించాడు . పూర్తి ఎంటర్ టైన్ మెంట్ తో తెరకెక్కిన ఈ ఎఫ్ 2 భారీ విజయం సాధించడంతో ఎఫ్ 3 కి సన్నాహాలు చేస్తున్నారు . నష్టాల్లో ఉన్న దిల్ రాజుకు భారీ లాభాలు తీసుకొచ్చి ఊరట నిచ్చింది ఎఫ్ 2 .

English Title: Venkatesh’s F2 world wide collections

 

[embedyt] https://www.youtube.com/embed?listType=playlist&list=UUkaEJ8uiBgAUwoaCZb1VJ2w[/embedyt]

35 Lakhs Fine to Mahesh babu AMBKani Kusruti faced sexual harrasmentSri Reddy: Koratala Siva is the boss of KamasutraMalika Arora revealed her divorce