భీష్మ కూడా హిట్ అయితే ఈ దర్శకుడ్ని ఆపలేంగాభీష్మ కూడా హిట్ అయితే ఈ దర్శకుడ్ని ఆపలేంగా
భీష్మ కూడా హిట్ అయితే ఈ దర్శకుడ్ని ఆపలేంగా

ఎంటర్టైన్మెంట్ చిత్రాలు తీసే దర్శకులకు ఉన్న డిమాండ్ వేరే జోనర్ చిత్రాలు తీసే దర్శకులకు ఉండదు. అన్ని వర్గాల ప్రేక్షకులకు చేరువవ్వాలంటే కచ్చితంగా ఎంటర్టైన్మెంట్ చిత్రాలే ఈజీ మార్గం. అందుకనే హీరోలు తరచుగా ఈ జోనర్ లో చిత్రాలు చేసేందుకు ఆసక్తి చూపిస్తుంటారు. సంక్రాంతికి విడుదలైన ఎంటర్టైన్మెంట్ చిత్రాలు సరిలేరు నీకెవ్వరు, అల వైకుంఠపురములో.. రెండూ కూడా బాక్స్ ఆఫీస్ వద్ద ఎలాంటి ఫలితాల్ని అందుకున్నాయో మనం చూసాం. ఎంటర్టైన్మెంట్ చిత్రాలకు ఉండే ప్రధాన బలం ఇదే. త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈ జోనర్ లో సినిమాలు తీయడంలో తోపు అయిపోయాడు. అనిల్ రావిపూడి ఇదే జోనర్ లో సినిమాలు తీస్తున్నా అవి మాస్ ప్రేక్షకులను ఎక్కువగా టార్గెట్ చేస్తున్నవే. ఇప్పుడు త్రివిక్రమ్ శిష్యుడు వెంకీ కుడుముల కూడా గురువు బాటలోనే పయనిస్తూ ఎంటర్టైనింగ్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలుస్తున్నాడు.

వెంకీ కుడుముల తన కెరీర్ లో చేసినవి రెండే సినిమాలు. మొదటి సినిమా ఛలోతో ఇండస్ట్రీ చూపును తనవైపుకు తిప్పుకోగలిగాడు వెంకీ. ఇప్పుడు రెండో చిత్రం భీష్మతో ప్రేక్షకులను పలకరించడానికి వస్తున్నాడు. ఈ సినిమా 21న విడుదలకు ముస్తాబైంది. ట్రైలర్ చూస్తుంటే ఒక హ్యాపీ కమర్షియల్ ఎంటర్టైనర్ చూడబోతున్నామన్న ఫీల్ కలిగించింది. సంక్రాంతి సినిమాల తర్వాత సరైన విజయం లేక మొహం వాచిపోయి ఉన్న ప్రేక్షకులకు పెర్ఫెక్ట్ ట్రీట్ ఇవ్వగలదన్న నమ్మకాన్ని కలిగించింది.

అయితే ఈ సినిమా చిత్రీకరణ దశలో ఉండగా వెంకీపై కొన్ని నెగటివ్ కామెంట్లు వచ్చాయి. తొలి చిత్రాన్ని 10 కోట్ల లోపు పూర్తి చేసిన ఈ దర్శకుడు, రెండో చిత్రం కోసం 25 కోట్లపైన ఖర్చు పెట్టించడాన్ని కొందరు నెగటివ్ గా తీసుకున్నారు. అయితే ఈ చిత్రానికి 35 కోట్ల మేరకు బిజినెస్ అవ్వడంతో 10 కోట్ల సితార ఎంటర్టైన్మెంట్స్ కు మిగిలాయి.

అలాగే తొలి చిత్రం నాగ శౌర్యతో, రెండో చిత్రం నితిన్ తో.. ఇలా రేంజ్ పెంచుకుంటూ వెళుతోన్న వెంకీకి అప్పుడే మూడో చిత్రం కన్ఫర్మ్ అయింది. మైత్రి మూవీ మేకర్స్ నుండి ఈ దర్శకుడికి అడ్వాన్స్ సిద్ధంగా ఉంది. భీష్మ కనుక విజయం సాధిస్తే తన రేంజ్ మరింత పెరుగుతుంది అనడంలో సందేహం లేదు.