వెంకీ కుడుములకు బంపర్ ఆఫర్ తగిలినట్టేగా?


వెంకీ కుడుములకు బంపర్ ఆఫర్ తగిలినట్టేగా?
వెంకీ కుడుములకు బంపర్ ఆఫర్ తగిలినట్టేగా?

సరైన సినిమా తీసి హిట్లు ఇస్తే దర్శకుడికి ఉండే డిమాండ్ వేరుగా ఉంటుంది. సినిమా సినిమాకు తన రేంజ్ పెంచుకుంటూ వెళ్తోన్న వెంకీ కుడుములకు ఇప్పుడు డిమాండ్ మాములుగా లేదు. మొదటి సినిమా ఛలోను కేవలం 10 కోట్ల లోపు బడ్జెట్ తో ముగించాడు వెంకీ. రెండో సినిమాకు కొంచెం ఫ్రీడమ్ వచ్చేసరికి 25 కోట్ల వరకూ ఖర్చుపెట్టించాడు. దీనిపై మొదట విమర్శలు వచ్చినా సినిమా విడుదలకు ముందే నిర్మాతలకు 10 కోట్ల మేర ప్రాఫిట్స్ రావడంతో వాళ్ళు హ్యాపీ. సినిమా విడుదలైన తర్వాత వస్తోన్న బ్రహ్మాండమైన కలెక్షన్స్ తో బయ్యర్లు కూడా హ్యాపీ. ఈ నేపథ్యంలో అందరి నమ్మకాన్ని గెలుచుకున్నాడు వెంకీ. సో నిర్మాణ సంస్థలు అడ్వాన్స్ లు పట్టుకుని వెంకీ చుట్టూ తిరుగుతున్నట్లు తెలుస్తోంది.

తాజా సమాచారం ప్రకారం ప్రముఖ నిర్మాణ సంస్థ యూవీ క్రియేషన్స్ ఇప్పటికే వెంకీతో సినిమాను లాక్ చేసుకున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. భారీ మొత్తం అడ్వాన్స్ గా ఇచ్చి వెంకీ తర్వాతి సినిమా తమ బ్యానర్ లోనే చేయాలని ఒప్పందం కుదుర్చుకున్నారట. మొదట రెండు సినిమాలకు ఓ మోస్తరు రెమ్యునరేషన్ తీసుకున్న వెంకీ, మూడో సినిమాకు మాత్రం భారీ మొత్తం తీసుకున్నట్లు సమాచారం.

వెంకీ తొలి చిత్రానికి నాగ శౌర్యతో చేసాడు. రెండో సినిమాకు నితిన్ కు కమిట్ అయ్యాడు. ఇలా సినిమా సినిమాకు రేంజ్ పెంచుకుంటూ వెళ్తోన్న ఈ దర్శకుడు ఇప్పుడు మూడో సినిమాకు అగ్ర హీరోతో పనిచేయాలని అనుకుంటున్నట్లు తెలుస్తోంది. మరి ఆ హీరో ఎవరో తెలియాలంటే మరికొంత కాలం ఆగక తప్పదు. ఇంకా వెంకీ తన తర్వాతి చిత్రానికి స్క్రిప్ట్ రెడీ చేయలేదట. స్క్రిప్ట్ రెడీ అయ్యాక అప్పుడున్న పరిస్థితి బట్టి హీరోని ఫైనల్ చేస్తారని తెలుస్తోంది.

భీష్మ చిత్రంలో నితిన్ టైటిల్ రోల్ పోషించగా రష్మిక హీరోయిన్ గా నటించింది. మహతి సాగర్ స్వరాలు అందించగా సితార ఎంటర్టైన్మెంట్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించింది.