నాగ చైతన్య సినిమాలకి ఎప్పుడు సమస్యలే…..పాపం


నాగ చైతన్య సినిమాలకి ఎప్పుడు సమస్యలే.....పాపం
నాగ చైతన్య సినిమాలకి ఎప్పుడు సమస్యలే…..పాపం

అక్కినేని యువ సామ్రాట్ ”నాగ చైతన్య” సినిమాలు రిలీజ్ కి సిద్ధమయ్యే సమయంలో ఎదో ఒక ఆటంకం జరుగుతూనే ఉంటుంది. గతంలో కూడా చాలా సినిమాలకి ఇలానే జరిగింది. అయితే సమస్య లేకుండా రిలీజ్ అయిన సినిమాలు మాత్రమే హిట్ అవ్వుతాయి. ఇది నాగ చైతన్య సినిమాల సెంటిమెంట్.

‘మజిలీ’ అని ఈ సంవత్సరం ఒక సినిమాని విడుదల చేసారు. ఆ సినిమాకి ఎటువంటి ఆటంకం జరగలేదు. సినిమా వచ్చింది హిట్ అయ్యింది. ఆ తర్వాత ‘ఓ బేబీ’ సినిమాలో చివరలో కనిపిస్తారు అది కూడా రిలీజ్ కి ముందు ఎటువంటి ఇబ్బంది కలగలేదు. అయితే గత సినిమాలు చూసుకుంటే ‘సాహసం శ్వాసగా సాగిపో’, ‘శైలజ రెడ్డి అల్లుడు’, ‘యుద్ధం శరణం గచ్చామి’, ‘దోచెయ్’, ‘ఆటో నగర్ సూర్య’ సినిమాలు చూస్కుంటే సినిమాలా విడుదల ముందు చేసిన హడావిడి అంత కాదు. అందుకే అవి ఫ్లాప్ అయ్యాయి.

ఇప్పుడు ‘వెంకీ మామ’ సినిమా గురించి కూడా పలు రకాల వార్తలు వస్తున్నాయి. సినిమా బడ్జెట్ గురించి ‘సురేష్ బాబు’ కి ఇబ్బందులు తగులుతున్నాయి అంటా. అందుకే సినిమా విడుదల ఇంకా ఆలస్యం అవుతుంది అంటున్నారు సినిమా యూనిట్. నాగ చైతన్య అభిమానులు కూడా సెంటిమెంట్ గురించి తెగ హైరానా పడుతున్నారు. మరి ఇలాంటి బడ్జెట్ విషయంలో వెనుక బడుతున్న వెంకీ మామ సినిమా రిలీజ్ అయిన తర్వాత కూడా హిట్ టాక్ విషయంలో వెనుక పడుతుంది అని సెంటిమెంట్ ని నమ్ముతున్నారు.

సినిమాలో వెంకటేష్ గారికి జోడిగా ‘పాయల్ రాజపుత్’. నాగ చైతన్య కి జోడిగా రాశి ఖన్నా నటిస్తున్నారు. కె.ఎస్.రవీంద్ర (బాబీ) దర్శకులు. మేన మామ గండం అనే సెంటిమెంట్ చుట్టూ తిరుగుతూ ఈ కథ నాగ చైతన్య క్యారక్టర్ లో తెగ మలుపులు ఉంటాయి అంటా. మరి నాగ చైతన్య గారి అభిమానులు అనుకుంటున్నట్లు సెంటిమెంట్ ని గెలిచి ఫ్లాప్ అవుతుందా? లేదా సెంటిమెంట్ ని తిప్పి కొట్టి సినిమా హిట్ అవుతుందా అనేది చూద్దాం.