వెంకీ మామ 10 రోజుల కలెక్షన్ రిపోర్ట్


వెంకీ మామ 10 రోజుల కలెక్షన్ రిపోర్ట్
వెంకీ మామ 10 రోజుల కలెక్షన్ రిపోర్ట్

విక్టరీ వెంకటేష్, అక్కినేని నాగ చైతన్య హీరోలుగా తెరకెక్కిన వెంకీ మామ మొదట యావరేజ్ టాక్ తెచ్చుకున్నా కానీ డీసెంట్ కలెక్షన్స్ తో దూసుకుపోతోంది. తొలి వారంలో పర్వాలేదనిపించేలా వసూళ్లు వచ్చినా, రెండు వారం ఈ చిత్రానికి నాలుగు సినిమాల రూపంలో గట్టి కాంపిటీషన్ ఉన్న నేపథ్యంలో వెంకీ మామ పనైపోయినట్లే అనుకున్నారంతా. అయితే విడుదలైన నాలుగు చిత్రాల్లో మూడు పెద్దగా ప్రభావం చూపవని అర్ధమైపోయింది. దబంగ్ 3, దొంగ రెండు అనువాద చిత్రాలు కూడా ప్రేక్షకులను ఆకట్టుకోవడంల విఫలమయ్యాయి. ఇక రూలర్ సినిమా వసూళ్ల గురించి ప్రస్తావించుకునే అవసరం లేదు. రెండో రోజే ఈ చిత్రానికి ప్రేక్షకుల ఆదరణ కరువైంది. చాలా చోట్ల రూలర్ కలెక్షన్స్ కంటే వెంకీ మామ కలెక్షన్స్ అత్యధికంగా ఉండడం విశేషం.

పది రోజులు పూర్తయ్యేసరికి వెంకీ మామకు ఇంకా స్థిరమైన కలెక్షన్స్ వస్తున్నాయి. ఇప్పటికే దాదాపు 75 శాతం బిజినెస్ ను వెనక్కి రాబట్టుకున్న వెంకీ మామ, సంక్రాంతి వరకూ పెద్ద సినిమాల తాకిడి లేకపోవడంతో అప్పటిదాకా రన్ ఉండే అవకాశముంది. ఈ నేపథ్యంలో వెంకీ మామ బిజినెస్ మొత్తాన్ని రికవర్ చేయడం ఈజీనే. మొత్తంగా వెంకీ మామతో వెంకటేష్, నాగ చైతన్య మరో హిట్ ను తమ ఖాతాలో వేసుకున్నట్లే.

బాబీ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో రాశి ఖన్నా, పాయల్ రాజ్ పుత్ హీరోయిన్లుగా నటించారు. సురేష్ బాబు నిర్మించిన ఈ చిత్రానికి థమన్ సంగీతం అందించాడు. పది రోజుల వెంకీ మామ కలెక్షన్స్ రిపోర్ట్ ను ఇప్పుడు చూద్దాం.

నైజాం – 10.17 కోట్లు

సీడెడ్ – 4.90 కోట్లు

నెల్లూరు – 0.86 కోట్లు

కృష్ణ – 1.45 కోట్లు

గుంటూరు – 2.08 కోట్లు

ఉత్తరాంధ్ర – 3.92 కోట్లు

ఈస్ట్ – 2.07 కోట్లు

వెస్ట్ – 1.17 కోట్లు

మొత్తం: 26.67 కోట్లు

రెండు తెలుగు రాష్ట్రాల్లో దాదాపు 31 కోట్లకు బిజినెస్ జరిగిన ఈ చిత్రం మరో వారం, లేదా రెండు వారాల్లో ఆ మార్క్ ను అందుకోనుంది.