వెంకీ మామ 13 రోజుల కలెక్షన్స్ రిపోర్ట్: బ్రేక్ ఈవెన్ కు దగ్గరగా…


Venky Mama 13 days Collections
Venky Mama 13 days Collections

విక్టరీ వెంకటేష్, అక్కినేని నాగ చైతన్య హీరోలుగా నటించిన మల్టీస్టారర్ వెంకీ మామ అందరి అంచనాలను దాటుకుంటూ బ్రేక్ ఈవెన్ దిశగా అడుగులు వేస్తోంది. ఫ్యామిలీ ఆడియన్స్ ఓన్ చేసుకుంటే ఎలాంటి సినిమాని అయినా హిట్ చేస్తారని మరోసారి రుజువైంది. నిజానికి వెంకీ మామ సినిమాకు వచ్చిన టాక్ కు ఇప్పుడు వస్తోన్న కలెక్షన్స్ కు అసలు సంబంధమే లేదు. క్రిటిక్స్ ఈ చిత్రానికి సాధారణ రేటింగ్ ఇచ్చారు, ఆడియన్స్ కూడా పర్వాలేదని మాత్రమే అన్నారు. నిజానికి వెంకీ మామకు బడ్జెట్ పరిమితిలు దాటి ఖర్చయింది. ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రాన్ని 36 కోట్లకు బిజినెస్ చేసారు. తెలుగు రాష్ట్రాల నుండే 31 కోట్ల బిజినెస్ జరిగింది. మొదటి వీకెండ్ తిరుగులేకుండా సాగినా తర్వాతి నుండి భారీ డ్రాప్స్ కనిపించాయి.

మొదటి మూడు రోజుల్లో వెంకీ మామ దాదాపు 18 కోట్ల షేర్ ను వసూలు చేసింది. అయితే వీక్ డేస్ లో డ్రాప్స్ కనిపించడంతో బ్రేక్ ఈవెన్ చేరుకోవడం అసాధ్యమనే అనుకున్నారంతా. అయితే డిసెంబర్ 20న విడుదలైన నాలుగు చిత్రాల్లో కేవలం ఒక్క సినిమాకే పాజిటివ్ రివ్యూలు రావడం వెంకీ మామకు కలిసొచ్చింది. అందుకే మళ్ళీ సెకండ్ వీకెండ్ నుండి వసూళ్లు పుంజుకున్నాయి. నిన్న క్రిస్మస్ సందర్భంగా వెంకీ మామ సూపర్ గా అడ్వాంటేజ్ ను క్యాష్ చేసుకుంది. ఈ చిత్రం రెండు తెలుగు రాష్ట్రాల్లో కోటికి పైగా షేర్ వసూలు చేసింది. దీంతో q  రోజుల్లో వెంకీ మామ దాదాపు 28 కోట్ల రూపాయల షేర్ ను వసూలు చేసింది. మరో మూడు కోట్లు వసూలు చేయగలిగితే వెంకీ మామ బ్రేక్ ఈవెన్ చేరుకోవడం ఖాయం. సినిమాకు వచ్చిన టాక్ కు ఈ కలెక్షన్స్ అంటే అది సాధారణ విషయం కాదు.

13 రోజుల వెంకీ మామ కలెక్షన్స్ బ్రేక డౌన్ ను గమనిస్తే..
నైజాం : Rs  10.92 కోట్లు
సీడెడ్ : Rs  4.42 కోట్లు
ఉత్తరాంధ్ర : Rs  4.45 కోట్లు
గుంటూరు : Rs 2.11 కోట్లు
కృష్ణ : Rs 1.63 కోట్లు
ఈస్ట్ గోదావరి : Rs  2.14 కోట్లు
వెస్ట్ గోదావరి: Rs 1.32 కోట్లు
నెల్లూరు : Rs 0.93 కోట్లు

మొత్తం : Rs. 27.92 కోట్లు

ప్రపంచవ్యాప్తంగా కూడా వెంకీ మామ కలెక్షన్స్ ఆశాజనకంగానే ఉన్నాయి. 36 కోట్లకు థియేట్రీకల్స్ అమ్ముడుపోగా ఇప్పటికే దాదాపు 34 కోట్లు వచ్చేసాయి. వచ్చే శని, ఆదివారాల్లో మళ్ళీ కలెక్షన్స్ పుంజుకునే అవకాశాలు ఉన్నాయి.