వెంకీ మామ ఫస్ట్ డే కలెక్షన్స్: మామ అల్లుళ్ళు కుమ్మేసారుగావెంకీ మామ ఫస్ట్ డే కలెక్షన్స్: మామ అల్లుళ్ళు కుమ్మేసారుగా
వెంకీ మామ ఫస్ట్ డే కలెక్షన్స్: మామ అల్లుళ్ళు కుమ్మేసారుగా

కాంబినేషన్ క్రేజ్ ఒక్కోసారి సినిమాలకు చాలా మేలు చేస్తుంది. దానికి సరైన ఉదాహరణ వెంకీ మామ సినిమా అని చెప్పొచ్చు. వెంకటేష్, నాగ చైతన్య కలిసి నటించిన వెంకీ మామ విడుదలకు ముందే భారీ క్రేజ్ తెచ్చుకుంది. నిజ జీవితంలో మామ అల్లుళ్ళు అయిన వెంకటేష్, నాగ చైతన్య ఈ చిత్రంలో కూడా అదే పాత్రలు పోషించడం, వెంకటేష్.. నాగ చైతన్య గత చిత్రాలు రెండూ కూడా సక్సెస్ లు సాధించడం వల్ల వెంకీ మామకు బాగా కలిసొచ్చింది. నిజానికి ఈ చిత్రానికి యావరేజ్ రేటింగులే వచ్చాయి. ఓల్డ్ కథతో, రొటీన్ స్క్రీన్ ప్లేతో తెరకెక్కిందని క్రిటిక్స్ అభిప్రాయపడ్డారు. అయితే ఇవేమీ ఆడియన్స్ ను థియేటర్లకు రాకుండా ఆపలేకపోయాయి. ముఖ్యంగా వెంకటేష్ క్రౌడ్ పుల్లర్ గా నిలిచాడు. ఎఫ్ 2 లో వెంకటేష్ కామెడీని అంత త్వరగా ఎవరూ మర్చిపోలేరు. వెంకీ మామ నుండి కూడా అదే స్థాయి కామెడీని ఆశించారు ప్రేక్షకులు.

అయితే కామెడీ అదే స్థాయిలో లేకపోయినా సెంటిమెంట్, యాక్షన్ కూడా పండడంతో సగటు కమర్షియల్ సినిమాగా వెంకీ మామను ప్రేక్షకులు ఆదరిస్తున్నారు. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో వెంకీ మామ ప్రభంజనం మాములుగా లేదు. మొదటి రోజు ఈ చిత్రం రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 7 కోట్ల షేర్ వసూలు చేసింది. వీకెండ్ వరకూ ఇదే ఊపు కొనసాగితే వెంకీ మామ సేఫ్ అయ్యేందుకు అవకాశాలు మెరుగవుతాయి.

వెంకీ మామ ఫస్ట్ డే కలెక్షన్స్ బ్రేక్ ఈవెన్:

నైజాం: 2.27 కోట్లు

సీడెడ్: 1.60 కోట్లు

వైజాగ్: 0.87 కోట్లు

ఈస్ట్: 0.60 కోట్లు

వెస్ట్: 0.30 కోట్లు

కృష్ణ: 0.72 కోట్లు

గుంటూరు: 0.37 కోట్లు

నెల్లూరు: 0.27 కోట్లు

రెండు తెలుగు రాష్ట్రాల మొత్తం: 7 కోట్లు

అయితే చిత్రానికి మిక్డ్స్ టాక్ వచ్చిన నేపథ్యంలో రానున్న రోజుల్లో ఎలా పెర్ఫార్మ్ చేస్తుందన్నది ముఖ్యం. వెంకీ మామ చిత్రాన్ని బాబీ తెరకెక్కించగా, సురేష్ బాబు, విశ్వప్రసాద్ సంయుక్తంగా నిర్మించారు. థమన్ సంగీత దర్శకుడు. రాశి ఖన్నా, పాయల్ రాజ్ పుత్ హీరోయిన్లు.