వెంకీ మామ 24 డేస్ కలెక్షన్స్ రిపోర్ట్


వెంకీ మామ 24 డేస్ కలెక్షన్స్ రిపోర్ట్
వెంకీ మామ 24 డేస్ కలెక్షన్స్ రిపోర్ట్

విక్టరీ వెంకటేష్, అక్కినేని నాగ చైతన్య హీరోలుగా నటించిన వెంకీ మామ చిత్రం ఫుల్ రన్ కు చేరువగా వచ్చింది. ఈ సినిమాకు మొదటిరోజున చాలా సాధారణమైన రివ్యూలు వచ్చాయి. భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ చిత్రానికి క్రిటిక్స్ ఈ రేటింగ్స్ ఇవ్వడంతో చిత్రం నిలబడడం కష్టమనే భావించారంతా. అయితే చాలా రోజుల తర్వాత ఒక పెద్ద సినిమా థియేటర్లలో రావడంతో అప్పటిదాకా సరైన సినిమాల్లేక ఎదురుచూసిన ప్రేక్షకులకు వెంకీ మామ సరైన ఆప్షన్ గా కనిపించింది. దాదాపు 36 కోట్లకు ఈ చిత్ర థియేట్రికల్ హక్కులు అమ్ముడుపోయాయి. ఇందులో తెలుగు రాష్ట్రాల నుండే 31 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది.

క్రిస్మస్ హాలిడేస్ తో పాటు న్యూ ఇయర్ ఈవ్ ను కూడా క్యాష్ చేసుకున్న వెంకీ మామ 24 రోజులు గడిచేసరికి ప్రాఫిట్స్ లో నిలిచింది. తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రం 32 కోట్లు వసూలు చేయగా ప్రపంచవ్యాప్తంగా 38 కోట్లు వసూలు చేసింది. ఇప్పటికే వెంకీ మామ బాగా స్లో అయింది. సంక్రాంతి సినిమాలు వచ్చేలోగా ఇంకా ఎంత వసూలు చేస్తుంది అనేది కీలకం.

తొలివారంలో అద్భుతమైన కలెక్షన్స్ సాధించిన వెంకీ మామకు మరింత మంచి టాక్ వచ్చి ఉంటే బ్లాక్ బస్టర్ రేంజ్ కు చేరుకునేది. మొత్తంగా ఈ చిత్రం హిట్ స్టేటస్ అయితే సాధించగలిగింది.

24 రోజుల వెంకీ మామ కలెక్షన్స్ బ్రేక్ డౌన్ ఇక్కడ చూద్దాం.

నైజాం : Rs 12.45 Cr

సీడెడ్ : Rs 4.89 Cr

వైజాగ్ : Rs 5.39 Cr

గుంటూరు: Rs 2.39 Cr

కృష్ణ : Rs 1.94 Cr

ఈస్ట్ : Rs 2.43 Cr

వెస్ట్ : Rs 1.48 Cr

నెల్లూరు : Rs 1.06 Cr

ఆంధ్ర+ తెలంగాణ : Rs 32.03 Cr Shares

రెస్ట్ ఆఫ్ ఇండియా: Rs 2.70 Cr

ఓవర్సీస్ : Rs 3.24 Cr

వరల్డ్ వైడ్ : Rs 37.97 Cr Shares

ప్రస్తుతం వెంకటేష్ తన తర్వాతి చిత్రం అసురన్ రీమేక్ కోసం సన్నద్ధమవుతుండగా, నాగ చైతన్య శేఖర్ కమ్ముల లవ్ స్టోరీలో నటిస్తున్నాడు.