బిగ్ బ్రేకింగ్ : సంక్రాంతి బరిలో వెంకీ మామ.. జరిగే పనేనా?

venky mama
venky mama

కీలకమైన దసరా సీజన్ ను మిస్ చేసుకుంది వెంకీ మామ టీమ్. ఇదెంత మంచి అవకాశమో సైరా కలెక్షన్స్ చూస్తుంటే తెలుస్తోంది. షూటింగ్ లేట్ అయిన కారణంగా దసరా సీజన్ ను మిస్ చేసుకున్న వెంకీ మామ టీమ్ ఇప్పుడు అంతకంటే పెద్ద పండగ సీజన్ అయిన సంక్రాంతిని టార్గెట్ చేస్తోంది. నిజానికి దసరాకు మిస్ అవుతుంది అని తెలియగానే ఈ చిత్రాన్ని నవంబర్ చివర్లో కానీ డిసెంబర్ మొదట్లో కానీ విడుదల చేయాలని భావించారు.

అయితే సురేష్ బాబు ఇప్పుడు సంక్రాంతికి విడుదల చేద్దామని భావిస్తున్నాడట. పండగ సీజన్ కు పెర్ఫెక్ట్ గా సూట్ అయ్యే క్లీన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ కావడంతో సంక్రాంతి అయితేనే బెస్ట్ అనుకుంటున్నాడట. ఐడియా బానే ఉంది కానీ ఇప్పుడున్న పరిస్థితులలో అది జరుగుతుందా అన్నదే సమస్య.

ఇప్పటికే సంక్రాంతికి నాలుగు సినిమాలు విడుదలవుతున్నాయి. సరిలేరు నీకెవ్వరు, అల వైకుంఠపురములో, ఎంత మంచివాడవురా, దర్బార్ సినిమాలు ఇప్పటికే సంక్రాంతికి షెడ్యూల్ అయ్యాయి. ఇంకా డేట్లు ఫిక్స్ అవ్వలేదు కానీ సంక్రాంతికి రావడం మాత్రం పక్కా. ఎంత పెద్ద పండగ అయితే మాత్రం నాలుగు సినిమాలు రిలీజ్ అవ్వడమే ఎక్కువ. మరి ఇప్పుడు ఐదో సినిమా వస్తానంటే అది జరిగే పనేనా?