వెంకీ మామ వీకెండ్ కలెక్షన్స్: అద్భుతమే!



venky mama weekend collection
venky mama weekend collection

కొన్ని సినిమాలకు టాక్ తో పనిలేదు. రివ్యూలు అసలు లెక్కే కాదు. అలాంటి సినిమానే వెంకీ మామగా చెప్పుకోవచ్చు. ఈ సినిమాకు వచ్చిన టాక్ కు, వస్తున్న కలెక్షన్స్ కు అసలు సంబంధమే లేదు. వెంకీ మామకు దాదాపు అందరు రివ్యూయర్లు యావరేజ్ రేటింగులే వేశారు. ఈ చిత్రం రొటీన్ అనీ, ట్రీట్మెంట్ మరీ పాత చింతకాయ పచ్చడి తరహాలో ఉందనేది క్రిటిక్స్ మాట. అయితే వెంకటేష్, నాగ చైతన్య కాంబినేషన్ బాక్స్ ఆఫీస్ వద్ద ప్రభావం చూపించొచ్చని అనుకున్నారు. అయితే క్రిటిక్స్ అందరూ ఆశ్చర్యపోయేలా, ట్రేడ్ పండితులు విస్తుపోయేలా వెంకీ మామ కలెక్షన్స్ వచ్చాయి. ఈ సినిమా మొదటి రోజే ప్రపంచవ్యాప్తంగా 8 కోట్లు వసూలు చేసి అందరినీ ఆశ్చర్యపరిచింది. అయితే తొలిరోజు కాబట్టి ఆలా ఉంది. రెండో రోజు నుండి పరిస్థితిలో మార్పు వస్తుంది అని అనుకున్న వాళ్లకు దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చింది వెంకీ మామ.

ఈ చిత్రం తొలి వీకెండ్ ముగిసేసరికి దాదాపు 45 కోట్ల గ్రాస్, 20 కోట్లకు పైగా షేర్ ప్రపంచవ్యాప్తంగా వసూలు చేసింది. అంటే దాదాపు 60 శాతానికి పైగా వచేసినట్లే. ఇక రెండో వీకెండ్ నాటికి హాలిడేస్ కూడా వస్తుండడంతో వెంకీ మామకు అన్ని అంశాలు ప్లస్ అయ్యేలా ఉన్నాయి. అయితే అంతకంటే ముందు ఈ చిత్రం వీక్ డేస్ లో ఎలా పెర్ఫార్మ్ చేస్తుందనేది చాలా ముఖ్యం. అదే ఈ చిత్ర విజయావకాశాలను డిసైడ్ చేస్తుంది.

వెంకీ మామ రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి సాధించిన మూడు రోజుల వసూళ్ల వివరాలు ఇక్కడ చూద్దాం.
నైజాం: 6.72 కోట్లు
సీడెడ్: 3.39 కోట్లు
ఉత్తరాంధ్ర: 2.25 కోట్లు
గుంటూరు: 1.50 కోట్లు
కృష్ణ: 1.04 కోట్లు
ఈస్ట్ గోదావరి: 1.43 కోట్లు
వెస్ట్ గోదావరి: 0.81 కోట్లు
నెల్లూరు: 0.64 కోట్లు
మొత్తం: 17.78 కోట్లు

రెండు తెలుగు రాష్ట్రాల నుండి దాదాపు 18 కోట్లు వసూలు చేసిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా 20 కోట్ల మార్క్ ను దాటేసింది. బాబీ తెరకెక్కించిన ఈ సినిమాలో వెంకటేష్ కు జోడిగా పాయల్ రాజ్ పుత్ నటించగా, రాశి ఖన్నా నాగ చైతన్యకు జోడిగా కనిపించింది. థమన్ సంగీతం ఈ సినిమాకు ప్రధాన బలంగా నిలిచిన సంగతి తెల్సిందే.